ఇప్పటి వ్యాక్సిన్లు కొత్త కరోనా వైరస్ పై పనిచేస్తాయా?

ఇప్పటి వ్యాక్సిన్లు కొత్త కరోనా వైరస్ పై పనిచేస్తాయా?
x
Highlights

వ్యాక్సిన్ వచ్చేసింది. అత్యవసర వినియోగం కింద కొన్నిదేశాల్లో ఉపయోగిస్తున్నారు కూడా ! ఇలాంటి టైమ్‌లో వెలుగులోకి వచ్చింది కొత్త స్ట్రెయిన్. మరి దీని మీద ప్రస్తుతం ఉన్న టీకాలు పనిచేస్తాయా? లేదంటే కథ మళ్లీ మొదటికి వచ్చినట్లేనా ? ఒకవేళ పనిచేయకపోతే పరిస్థితి ఏంటి ? సైంటిస్టులు ఏం చెప్తున్నారు ?

వ్యాక్సిన్ వచ్చేసింది. అత్యవసర వినియోగం కింద కొన్నిదేశాల్లో ఉపయోగిస్తున్నారు కూడా ! ఇలాంటి టైమ్‌లో వెలుగులోకి వచ్చింది కొత్త స్ట్రెయిన్. మరి దీని మీద ప్రస్తుతం ఉన్న టీకాలు పనిచేస్తాయా? లేదంటే కథ మళ్లీ మొదటికి వచ్చినట్లేనా ? ఒకవేళ పనిచేయకపోతే పరిస్థితి ఏంటి ? సైంటిస్టులు ఏం చెప్తున్నారు ?

నాలుగైదు దేశాల్లో కనిపించాయ్ కొత్తరకం స్ట్రెయిన్స్ ! కరోనా కంటే ఇది 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు గుర్తించారు. ఐతే ఇప్పుడు కొత్త అనుమానం జనాలను వేధిస్తోంది. వ్యాక్సిన్‌ ప్రయోగాలు అన్నీ ఇప్పుడు చివరిదశకు చేరుకున్నాయ్. ఇలాంటి సమయంలో కొత్త రకం స్ట్రెయిన్‌పై అవి పనిచేస్తాయా.. ఇన్నాళ్ల కష్టం వృథా అయినట్లేనా... బూడిదలో పోసిన పన్నీరేనా అన్న చర్చ కూడా జరుగుతోంది జనాల్లో ! ఇలాంటి సమయంలో పలు సంస్థలు కీలక ప్రకటన చేశాయ్.

ఫైజర్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి అమెరికా ఇప్పటికే అనుమతించింది. జనాల్లో ఉన్న భయాలను పోగొట్టేందుకు బైడెన్ కూడా వేయించుకున్నారు టీకా ! ఐతే ఈవ్యాక్సిన్‌లు వినియోగానికి రావడానికి ముందే...కొవిడ్ వైరస్ రూపాంతరలపై కూడా ఇవి పని చేయగలవని ఆయా కంపెనీలు తెలిపాయ్. ఐతే ఆ విషయాన్ని మరోసారి నిర్ధారించుకునేందుకు మళ్లీ పరీక్షలు చేయబోతున్నాయ్. దీంతో కొత్త స్ట్రెయిన్‌ను ఈ రెండు వ్యాక్సిన్లు నిరోధించగలవా లేదా అనేది మరికొన్ని వారాల్లో తేలిపోనుంది.

ఇక అటు మోడెర్నా సంస్థ కూడా ఇలాంటి విశ్వాసమే వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం... యూకేలో బైటపడిన కొత్త స్ట్రెయిన్‌ను కూడా ఎదుర్కొనే ఇమ్యూనిటీని తమ వ్యాక్సిన్ ఇవ్వగలదని భావిస్తున్నామని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. ఐతే మరో వారం రోజుల పాటు సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కొత్త స్ట్రెయిన్‌ను కూడా ఈ టీకాలు న్యూట్రలైజ్ చేసే సామర్థ్యం ఉంటే సరేసరి.. లేదంటే పరిస్థితులు మళ్లీ మొదటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోఎన్‌ టెక్‌ కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్ స్ట్రెయిన్‌కు టీకా తయారు చేయగలమని ప్రకటించింది. టీకా సమర్థవంతంగానే పనిచేస్తుందని... అవసరమైతే ఈరకం వైరస్‌పై నేరుగా ప్రయోగాలు ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. ఐతే కొత్త రకం వైరస్ విజృంభణ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదని.. సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ మాండె అన్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన టీకాలు.. కొత్త రకం వైరస్‌పై సమర్ధంగా పనిచేస్తాయని భరోసా ఇచ్చారు.

టీకాల సంగతి ఎలా ఉన్నా... ప్రతీ ఒక్కరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. భౌతిక దూరంతో పాటు మాస్క్ ధరించి కరోనాపై పోరాటాన్ని ఇంకొన్ని రోజులు కొనసాగించాలని చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories