IRCTC: తత్కాల్‌ టికెట్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి – ఇలా లింక్ చేయాలి

IRCTC: తత్కాల్‌ టికెట్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి – ఇలా లింక్ చేయాలి
x

IRCTC: Aadhaar Made Mandatory for Tatkal Ticket Booking – Here's How to Link It

Highlights

ఇకపై ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి. ఆధార్‌తో ఐఆర్‌సీటీసీ ఖాతాను ఎలా లింక్ చేయాలో పూర్తి సమాచారం ఈ స్టెప్ బై స్టెప్ గైడ్‌లో తెలుసుకోండి.

ఇకపై ఐఆర్‌సీటీసీలో తత్కాల్‌ రైలు టిక్కెట్లు బుక్ చేయాలంటే ఆధార్‌ లింక్ తప్పనిసరి. అవును, పారదర్శకత కోసం IRCTC కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేస్తేనైనా, తత్కాల్ కోటాలో టికెట్ల కోసం ఆధార్‌ ఆధారిత ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి చేస్తోంది.

ఏజెంట్ల దుర్వినియోగానికి చెక్!

పలు ఏజెంట్లు బల్క్ బుకింగ్స్ ద్వారా తత్కాల్ కోటాను దుర్వినియోగం చేస్తున్నారని IT అధికారుల గుర్తింపు. ఈ నేపథ్యంలో, సాధారణ ప్రయాణికుల హక్కులను కాపాడేందుకు ఐఆర్‌సీటీసీ ఆధార్ ఆధారిత ఓటీపీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది.

తత్కాల్ బుకింగ్‌కు ముందే ఆధార్ లింక్ చేయండి

తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో అంతిమ నిమిషాల్లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీ IRCTC ఖాతాతో ఆధార్‌ను ముందే లింక్ చేయడం ఉత్తమం. దీని కోసం మీ ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ధృవీకరించడం అవసరం.

IRCTCలో ఆధార్ లింక్ చేసే విధానం – స్టెప్ బై స్టెప్

Step 1:

IRCTC అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి, మీ లాగిన్ వివరాలతో సైన్ ఇన్ చేయండి.

Step 2:

పై మెనూ నుంచి "My Profile" > "Link Your Aadhaar" ఆప్షన్‌ను ఎంచుకోండి.

Step 3:

మీ ఆధార్ కార్డులో ఉన్నట్లు పూర్తి పేరు, మరియు 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేయండి.

Step 4:

చెక్‌బాక్స్‌ను టిక్ చేసి "Send OTP" క్లిక్ చేయండి. మీ ఆధార్‌తో లింకైన మొబైల్‌కి ఓటీపీ వస్తుంది.

Step 5:

ఆ ఓటీపీని నమోదు చేసి, "Verify OTP" > "Update" బటన్‌పై క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ పాప్-అప్ వస్తే, లింకింగ్ పూర్తైనట్లే.

ప్రయాణికుల కోసం మంచి మార్గం

ఈ కొత్త విధానం వల్ల ప్రామాణిక ప్రయాణికులకు తత్కాల్ టిక్కెట్లు అందుబాటులోకి రావడం తోపాటు, టికెట్ బ్లాక్ చేసే ఏజెంట్ల వ్యవహారాన్ని కూడా అరికట్టే అవకాశం ఉంది. దీని ద్వారా IRCTC సేవల్లో పారదర్శకత, నమ్మకం మరింత పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories