Invitation to All States CM's: సీఎం లందరికీ అహ్వానం.. ఎక్కడికో తెలుసా?

Invitation to All States CMs: సీఎం లందరికీ అహ్వానం.. ఎక్కడికో తెలుసా?
x
Ram Mandir
Highlights

Invitation to All States CM's: అయోధ్య‌లో రామ మందిన నిర్మాణం భూమి పూజ కోసం అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఆహ్వానం ప‌లికిన‌ట్టు శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు తెలిపింది.

Invitation to All States CM's: అయోధ్య‌లో రామ మందిన నిర్మాణం భూమి పూజ కోసం అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఆహ్వానం ప‌లికిన‌ట్టు శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు తెలిపింది. తొలుత కొంత మందికి మాత్ర‌మే ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్టు చెప్పిన‌ప్ప‌టికీ.. చివ‌రికి ముఖ్య‌మంత్రులంద‌రినీ కార్య‌క్ర‌మానికి పిల‌వాల‌ని నిర్ణ‌యించింది. ఆగ‌స్టు 5న జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధా‌ధాని మోదీ ముఖ్య అతిథిగా హాజ‌రు కానుండ‌గా.. తొలుత ఆయ‌న అక్కడే ఉన్న హ‌నుమాన్ ఘ‌రి ఆల‌యంలో రాముడు, హ‌నుమంతుడికి పూజ‌లు చేస్తార‌ని ట్ర‌స్ట్ కోశాధికారి చెప్పారు.

సోష‌ల్ డిస్టాన్స్ కార‌ణంగా.. 200 మంది కంటే ఎక్కువ మందికి ఈ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. అతిథుల‌తో క‌లిసి మొత్తం 200 మందికి మాత్ర‌మే ప్ర‌వేశం క‌ల్పిస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే ఐదు వెండి ఇటుకల‌తో గ‌ర్భ గుడి ప్ర‌దేశం‌లో రామ మందిరం నిర్మాణానికి శ్రీకారం చుడుతుండ‌గా.. మొద‌టి ఇటుకను ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా అమ‌ర్చ‌నున్నారు. మొత్తం మూడు రోజులు పాటు ఈ వేడుక జ‌ర‌గ‌నుంది.రామాలయం భూమి పూజలో మొత్తం ఐదు వెండి ఇటుకలను ఏర్పాటు చేయనున్నారు. తొలి 40 కిలోల వెండి ఇటుకను మోడీ పేర్చ‌నున్నారు. హిందూ పురాణాల ప్ర‌కారం.. అయిదు గ్ర‌హాల‌కు సూచ‌కంగా అయిదు వెండి ఇటుక‌ల‌ను వాడ‌నున్నారు.

విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌ ఇచ్చిన డిజైన్ ప్ర‌కార‌మే ఆల‌యాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు ఆల‌యం శైలిలో ఆల‌యాన్ని రూపొందించారు. అష్ట‌భుజ ఆకారంలో గ‌ర్భాల‌యం ఉండనుంది. గ‌తంలో ఇచ్చిన మోడ‌ల్ క‌న్నా.. ఇప్పుడు శ్రీరామాలయం ఎత్తు, వైశాల్యం, పొడుగును కొంత పెంచారు. ముందుగా అనుకున్న మూడు గోపురాల స్థానంలో.. అయిదు గోపురాల‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆల‌య విస్తీర్ణం సుమారు 76 వేల చ‌ద‌ర‌పు గ‌జాల నుంచి 84వేల చ‌ద‌ర‌పు గ‌జాలు ఉంటుంది. గతంలో కేవ‌లం 38వేల చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో ఆల‌యాన్ని నిర్మించాల‌నుకున్నారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుండటంతోపాటు ఇప్పుడు బాలరాముడు ఎక్కడైతే పూజలు అందుకుంటున్నాడో అక్కడి నుంచే ఆలయం మొదలు కానుంది.

అయోధ్య రాముడి గుడి నిర్మాణ భూమి పూజ ప్రణాళికలో వేగం పెంచింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. ఇప్పటికే తేదీని ఫెక్స్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా అతిథుల లిస్ట్ ను కూడా ఫైనల్ చేసింది. ఈ కార్యక్రమానికి 250 మంది అతిథులనే పిలవాలని ట్రస్టు నిర్ణయించింది. భూమిపూజ కార్యక్రమానికి అయోధ్యలోని ముఖ్యమైన సాధువులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ సీనియర్ ప్రతినిధులను పిలవాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున కొద్ది మందిని మాత్రమే పిలవాలని నిర్ణయించింది. ఆగస్టు 5వతేదీన జరగనున్న రామాలయం భూమిపూజ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories