నిత్యానందకు ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్‌ నోటీసులు

నిత్యానందకు ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్‌ నోటీసులు
x
నిత్యానంద
Highlights

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామికి ఉచ్చు బిగుస్తుంది.

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామికి ఉచ్చు బిగుస్తుంది. ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద గత ఏడాది పాస్‌పోర్టు లేకుండానే భారత దేశం నుంచి వెళ్ళిపోయారు. నిత్యానందపై గుజరాత్, కర్ణాటకలలో అత్యాచారం, అపహరణ కేసులు నమోదయ్యాయి..గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని నిత్యానంద ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు అద‌‌ృశ్యమవడంతో గత ఏడాది నవంబరులో ఆయనపై FIR నమోదైంది.

ఈ నేపథ్యంలో స్వామి నిత్యానంద ఆచూకీ వెల్లడించాలని భారత ప్రభుత్వం కోరింది. దీంతో ఇంట‌ర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసింది. రెడ్‌ కార్నర్‌ నోటీసులు త్వరలో జారీ చేసే అవకాశం ఉంది. రెడ్ కార్నర్ నోటీసు జారీ అయితే నిత్యానందను అరెస్టు చేయడానికి వీలవుతుంది. బాలికలు అద‌‌ృశ్యం కేసుకు సంబంధించి పోలీసులు స్థానిక కోర్టులో ఓ అభియోగపత్రాన్ని దాఖలు చేశారు.

స్వామి నిత్యానంద ఆశ్రమాలను నడుపుతూ విదేశీ భక్తులను కూడా ఆకర్పించాడు. వారిని వశపరుచుకోవడం సిద్ధహస్తుడిగా పేరుగడించాడు. లైంగిక, అత్యాచార ఆరోపణల్లో జైలు జీవితాన్ని అనుభవించి బెయిల్ పై విడుదలైయ్యాడు. తర్వాత పరారీలో ఉన్నాడు. నిత్యానంద చిన్నారులను బంధించిలైంగికంగా వేధించిన‌ట్లు అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆశ్రమం నుంచి ఇద్దరు యువతులు అదృశ్యం కేసు అతనిపై ఉంది. ఈక్వెడార్‌లో ద్వీపాన్ని కొనుగోలు చేసి కైలాసం అనే దేశం నిర్మించ‌నున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈక్వెడార్‌లో లేర‌ని, హైతీకి పరారైనట్లు ఎంబీసీ తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories