Vijay Mallya: బ‌హుశా ఇంద్ర భ‌వ‌నం ఇలాగే ఉంటుందేమో.. విజ‌య్ మాల్యా పెంట్ హౌజ్‌లో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు

Vijay Mallya
x

Vijay Mallya: బ‌హుశా ఇంద్ర భ‌వ‌నం ఇలాగే ఉంటుందేమో.. విజ‌య్ మాల్యా పెంట్ హౌజ్‌లో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు

Highlights

Vijay Mallya: బెంగళూరు నగరంలో ఆకాశాన్ని అంటేలా క‌నిపించే భారీ నిర్మాణాల్లో కింగ్‌ఫిషర్ టవర్ ఒక‌టి. ఈ ట‌వ‌ర్‌పై ఒక పెంట్ హౌజ్ ఉంటుంది. ఇది మ‌రెవ‌రిదో కాదు లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాది.

Vijay Mallya: బెంగళూరు నగరంలో ఆకాశాన్ని అంటేలా క‌నిపించే భారీ నిర్మాణాల్లో కింగ్‌ఫిషర్ టవర్ ఒక‌టి. ఈ ట‌వ‌ర్‌పై ఒక పెంట్ హౌజ్ ఉంటుంది. ఇది మ‌రెవ‌రిదో కాదు లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాది. యుబి సిటీ సమీపంలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలోని 34వ అంతస్తు పైభాగంలో ఉన్న ఈ పెంట్‌హౌస్ భూమి నుండి 400 అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఈ పెంట్ హౌజ్ నుంచి 360 డిగ్రీలో నగరాన్ని వీక్షించేందుకు ప్రత్యేక డిజైన్ చేశారు. అలాగే స్విమ్మింగ్ పూల్,

ప్రైవేట్ హెలిప్యాడ్, వ్యక్తిగత లిఫ్ట్, హోమ్ ఆఫీస్, లాబీ లాంటి విభిన్న సదుపాయాలు ఉన్నాయి. ఇది దాదాపు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్యా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న విల్లా. కానీ మాల్యా ఆ ఇంటిలో ఒక్కరోజు కూడా గడపలేకపోయాడు.

ఈ కింగ్ ఫిష‌ర్ ట‌వ‌ర్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, రచయిత్రి సుధా మూర్తి, జెరోధర్ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందర్ షా వంటి ప్రముఖులు కూడా నివ‌సిస్తున్నారు.

ఇక్కడి ప్రతి అపార్ట్‌మెంట్ సుమారు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి, కనీస ధర రూ. 20 కోట్ల నుంచి మొదలవుతుంది.

పెంట్ హౌజ్ ధ‌ర ఎంత అంటే

విజ‌య్ మాల్యా నిర్మించుకున్న పెంట్ హౌజ్ ధ‌ర సుమారు రూ. 170 కోట్లు ఉంటుంద‌ని అంచనా. కానీ ఆ విల్లాలో విజయ్ మాల్యా ఒక్కరోజు కూడా నివసించలేకపోయాడు. దీనికి కార‌ణంగా ఆయ‌న ప‌లు కేసుల్లో ఇరుక్కుని దేశాన్ని వ‌దిలి వెళ్ల‌డ‌మే. ఇలా ఎంతో ఇష్ట‌ప‌డి నిర్మించుకున్న ఇంటిలో మాల్యా ఉండ‌లేక‌పోవ‌డం నిజంగానే విషాదం క‌దూ.

Show Full Article
Print Article
Next Story
More Stories