నిప్పులు కురిపిస్తున్న చెట్టు వైరల్ వీడియో

నిప్పులు కురిపిస్తున్న చెట్టు  వైరల్ వీడియో
x
Highlights

అద్భుతం ఈ చెట్టు మాత్రం పాలుకాదు ఏకంగా నిప్పులు కురిపిస్తుంది. అగ్నిపర్వతం రగులుతున్నట్లుగా ఆ చెట్టు కాండంతో నుంచి మంటలు వస్తున్నాయి.

బ్రహ్మంగారి కాలజ్ఙానంలో వేప చెట్టు నుంచి తెల్లటి పాలు వస్తాయని అవి చూసి జనులు ఆశ్చర్యపోతారు అని చెపుతారు. ఇది మరో అద్భుతం అయితే ఈ చెట్టు మాత్రం పాలుకాదు ఏకంగా నిప్పులు కురిపిస్తుంది. అగ్నిపర్వతం రగులుతున్నట్లుగా ఆ చెట్టు కాండంతో నుంచి మంటలు వస్తున్నాయి. ఈ వింత ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


ఈ ఘటన టెక్సాస్‌‌లోని త్రినిటీకి చెందిన గ్లెన్ ర్యాట్ క్లిఫ్ అనే వ్యక్తి తీసిన ఈ వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో నెటింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే ఎవరైనా మంటలు పెట్టారా అనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి అది ఓ పిడుగు పాటు వల్ల ఏర్పడిన చిచ్చు. పిడుగు చెట్టు కాండంలోకి చోచ్చుకుపోవడంతో ఈ మంటలు చెలరిగాయి. గైన్ ర్యాట్‌క్లిఫ్ తీసిన వీడియోను తన వ్యక్తిగత టిక్ టాక్ లో షేర్ చేశాడు. దానిని మరో వ్యక్తి సోఫైన్ ట్వీటర్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోను 5లక్షల మంది లైక్ చేస్తే మరో 1.34లక్షల మంది రీట్వీట్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories