'ఆపరేషన్‌ సముద్ర సేతు'లో 700 మంది భారతీయులు

ఆపరేషన్‌ సముద్ర సేతులో 700 మంది భారతీయులు
x
Highlights

విదేశాలలో చిక్కుకున్న భారతీయుల తిరిగి తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం సముద్ర సేతు మిషన్, వందే భారత్ మిషన్ నడుపుతోన్న సంగతి తెలిసిందే. సముద్ర సేతు...

విదేశాలలో చిక్కుకున్న భారతీయుల తిరిగి తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం సముద్ర సేతు మిషన్, వందే భారత్ మిషన్ నడుపుతోన్న సంగతి తెలిసిందే. సముద్ర సేతు మిషన్ రెండో దశలో ఆదివారం నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ జలష్వ్ శ్రీలంకలోని కొలంబో నౌకాశ్రయానికి చేరుకుంది. ఇది సోమవారం ఆలస్యంగా అక్కడ నుండి బయలుదేరి 700 మంది భారతీయులతో తమిళనాడులోని టుటికోరిన్ చేరుకుంటుంది. ఆ తరువాత మరోసారి భారతీయులను తీసుకురావడానికి మాల్దీవులకు బయలుదేరుతుంది. జలాష్వ్ ఇప్పటివరకు విదేశాల నుండి 1286 మందిని తీసుకువచ్చింది.

జలష్వా నుండి భారతీయులు తిరిగి రావడానికి సంబంధించిన పనులను పూర్తి చేసే పనిని కొలంబోలోని భారత రాయబార కార్యాలయానికి అప్పగించారు. శ్రీలంక నావికాదళం, స్థానిక అధికారులు కూడా దీనికి సహకరిస్తారు. మాల్దీవుల రాజధాని మాలె నుండి రెండుసార్లు భారతీయులను జలస్వా తీసుకువచ్చిది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories