మహారాష్ట్రలో మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌పై ఇంక్ దాడి

Ink attack on Minister Chandrakant Patil in Maharashtra
x

మహారాష్ట్రలో మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌పై ఇంక్ దాడి

Highlights

Chandrakant Patil: దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Chandrakant Patil: మహారాష్ట్ర మంత్రి, BJP సీనియర్‌ నేత చంద్రకాంత్‌పాటిల్‌‎పై ఓ వ్యక్తి ఇంక్ చల్లాడు. పుణెలోని మిమ్రీలో ఆయన పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రాతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంత్రి చంద్రకాంత్ రెండ్రోజుల క్రితం అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే‎‎పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇంక్ దాడి తర్వాత మంత్రికి వ్యతిరేకంగా కొందరు ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలిపేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేయగా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. నిన్న ఓ కార్యక్రమంలో మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌ విద్యాలయాల అభివృద్ధి కోసం అప్పట్లో అంబేద్కర్, పూలే ప్రభుత్వ నిధులను కోరలేదని పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలంటే ప్రజలంతా ఒక్కటై నిధులు 'అడుక్కోవాలి' అని వ్యాఖ్యానించారు. డుక్కోమనడం అనే పదం వివాదాస్పదమైంది. దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కూడా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్ధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories