Coronavirus: రోమ్ లో చిక్కుకున్న భారతీయులు.. రంగంలోకి ఎయిర్ ఇండియా

Coronavirus: రోమ్ లో చిక్కుకున్న భారతీయులు.. రంగంలోకి ఎయిర్  ఇండియా
x
Air Craft
Highlights

కరోనావైరస్ వ్యాప్తి తో రోమ్ లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా శనివారం మధ్యాహ్నం 787 డ్రీమ్‌లైనర్ విమానాన్ని రోమ్‌కు పంపుతుంది.

కరోనావైరస్ వ్యాప్తి తో రోమ్ లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా శనివారం మధ్యాహ్నం 787 డ్రీమ్‌లైనర్ విమానాన్ని రోమ్‌కు పంపుతుంది. రోమ్‌కు వెళ్లే విమానం మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుందని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ఈ విమానం రోమ్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ ఖాళీ చేసి ఆదివారం ఉదయం ఢిల్లీకి తీసుకు వస్తుందని అధికారి తెలిపారు. కాగా మార్చి 22 నుండి ఒక వారం పాటు అంతర్జాతీయ విమానాలను భారతదేశంలో ల్యాండ్ చేయడానికి అనుమతించబోమని కేంద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటనను దృష్టిలో ఉంచుకొని రోమ్ లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విమానంలో సిబ్బంది తోపాటు పదిమంది దాకా ఎయిమ్స్ వైద్య నిపుణులు వారికి సహాయంగా పలువురు నర్సులు కూడా ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే చైనా, ఇరాన్, మలేషియా తదితర దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని భారత్ కు రప్పించారు. అలాంటి వారికోసం వారికోసం ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories