Indian Railways: రైల్వే ప్రయాణంలో లోయర్‌బెర్త్‌ దొరకలేదా.. IRCTC మార్గదర్శకాలు ఏంటంటే..?

Indian Railways News Find Out the IRCTC Guidelines Regarding Lower Berth | National News
x

Indian Railways: రైల్వే ప్రయాణంలో లోయర్‌బెర్త్‌ దొరకలేదా.. IRCTC మార్గదర్శకాలు ఏంటంటే..?

Highlights

Indian Railways: మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు ఈ విషయం మీకు ఉపయోగపడుతుంది...

Indian Railways: మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు ఈ విషయం మీకు ఉపయోగపడుతుంది. భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు సీనియర్ సిటిజెన్లకి లోయర్ బెర్త్‌ ప్రాధాన్యత ఉంటుంది. కానీ టికెట్ బుకింగ్ సమయంలో సీనియర్ సిటిజన్స్ కోసం రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా కొంతమందికి లోయర్ బెర్త్ దొరకదు. దీంతో వారు ప్రయాణించడం చాలా కష్టంగా మారుతుంది. వాస్తవానికి లోయర్ బెర్త్‌ని ఎలా ధృవీకరిస్తారో అనేది ఐఆర్‌సీటీసీ వివరించింది.

ట్విట్టర్‌ వేదికగా ఒక ప్రయాణికుడు భారతీయ రైల్వేని ప్రశ్నించాడు. సీటు అలాట్‌మెంట్‌ను అమలు చేయడంలో లాజిక్ ఏంటని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ అడిగాడు. 'నేను ముగ్గురు సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ప్రాధాన్యతతో టిక్కెట్లు బుక్ చేసాను. అప్పుడు వారికి మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, పక్క లోయర్ బెర్త్ ఇచ్చారు. మీరు దీనిని మార్చాలని కోరాడు' ఈ ప్రశ్నపై IRCTC ట్విట్టర్‌లో వివరణ ఇచ్చింది. లోయ‌ర్ బెర్త్ సీటు క‌న్ఫమ్ కావాలంటే.. పురుషులు అయితే 60 ఏళ్లు పైబ‌డి ఉండాలి.

స్త్రీలు అయితే 45 ఏళ్లు పైబ‌డి ఉండాలి. ఇద్దరు కానీ.. ఒక్కరు కానీ.. ఒకే టికెట్ మీద ప్రయాణిస్తే.. అప్పుడు వాళ్లకు లోయ‌ర్ బెర్త్‌లు ఖ‌చ్చితంగా క‌న్ఫమ్ అవుతాయ‌ని రైల్వేస్ రిప్లయి ఇచ్చింది. అంటే టికెట్ బుక్ చేసేట‌ప్పుడు సీనియ‌ర్ సిటిజ‌న్స్ వ‌య‌సును ఖ‌చ్చితంగా తెలపాలి. అప్పుడే లోయ‌ర్ టికెట్స్ బుక్ అవుతాయి. ఈ ట్రిక్ తెలుసుకుంటే.. సీనియ‌ర్ సిటిజన్స్‌కు ఎప్పుడైనా లోయ‌ర్ టికెట్ బుక్ చేయొచ్చు. అలాగే.. సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోస‌మే అన్ని రైళ్లలో రైల్వే శాఖ కొన్ని టికెట్లను ప్రత్యేకంగా కేటాయించింది. అవి కేవ‌లం వాళ్లకే బుక్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories