
రైల్వే టికెట్ల కోసం దొంగచాటుగా బుకింగ్స్ చేస్తే ఇక జైలుకే..3 కోట్ల యూజర్ ఐడీలు బ్లాక్
IRCTC : రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ భారీ ప్రక్షాళన చేపట్టింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ, సామాన్యులకు సైతం సులభంగా టికెట్లు దొరికేలా లేటెస్ట్ టెక్నాలజీని రంగంలోకి దించింది. రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ తత్కాల్ టికెట్ అంటేనే ఒక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది. మనం వెబ్‌సైట్ ఓపెన్ చేసేలోపే టికెట్లు మాయమైపోతుంటాయి. దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించిన ఇండియన్ రైల్వేస్, టికెట్ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి అక్రమంగా బుక్ చేసే వారిపై ఉక్కుపాదం మోపింది. రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం..2025 నాటికి ఏకంగా 30.3 మిలియన్ల (3 కోట్లకు పైగా) అనుమానాస్పద యూజర్ ఐడీలను రైల్వే శాఖ బ్లాక్ చేసింది.
తత్కాల్‌కు ఆధార్ తప్పనిసరి
ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత పారదర్శకంగా మారనుంది. ఆన్‌లైన్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారు కచ్చితంగా ఆధార్ ఆధారిత OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికుడి గుర్తింపు తక్షణమే నిర్ధారణ అవుతుంది. నకిలీ ఐడీలతో లేదా ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్లతో టికెట్లు బుక్ చేసే వారికి ఇది పెద్ద చెక్ అని చెప్పవచ్చు. నిజమైన ప్రయాణీకులకు మాత్రమే టికెట్లు దొరకాలనే లక్ష్యంతో ఈ కీలక మార్పును ప్రవేశపెట్టారు.
సైబర్ దాడులపై ఉక్కుపాదం
రైల్వే బుకింగ్ వ్యవస్థపై జరుగుతున్న సైబర్ దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి కేవలం ఆరు నెలల కాలంలోనే 60.43 బిలియన్ల హానికరమైన ఈమెయిల్‌లను రైల్వే సర్వర్లు బ్లాక్ చేశాయి. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా 12,819 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్‌లను శాశ్వతంగా తొలగించారు. రైల్వే వ్యవస్థను డేటా సెంటర్-గ్రేడ్ సెక్యూరిటీ సాధనాలతో భద్రపరిచామని మంత్రి వివరించారు.
లేటెస్ట్ టెక్నాలజీతో చెక్
సాధారణ ప్రయాణికులకు వెబ్‌సైట్ లోడ్ అవ్వడంలో ఇబ్బంది కలగకుండా కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ (CDN)ను ఏర్పాటు చేశారు. వెబ్‌సైట్‌పై పడే లోడ్‌ను ఇది తగ్గిస్తుంది. దీనికి తోడు బాట్‌లు లేదా ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్లు చొరబడకుండా అకామై (Akamai) వంటి యాంటీ-బాట్ సొల్యూషన్లను ఉపయోగిస్తున్నారు. బహుళ స్థాయిలలో కాప్చా (Captcha) కోడ్లు, సేఫ్టీ కంట్రోల్స్ ఉండడం వల్ల ఇక మీదట దొంగచాటుగా టికెట్లు బుక్ చేయడం అసాధ్యమని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




