ట్రైన్ కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చేస్తున్న రైల్వే శాఖ

ట్రైన్ కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చేస్తున్న రైల్వే శాఖ
x
Highlights

కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో రైలు కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించడంపై సాధ్యాసాధ్యలను భారతీయ రైల్వే అధ్యయనం చేస్తోంది.

కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో రైలు కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించడంపై సాధ్యాసాధ్యలను భారతీయ రైల్వే అధ్యయనం చేస్తోంది.ఢిల్లీ డివిజన్ విభాగం అధ్యయనం కోసం నమూనాలను రూపొందించింది.. ఇతర రాష్ట్రాల్లోని వర్క్‌షాపులు కూడా ఇటువంటి సౌకర్యాలను తయారు చేస్తున్నాయి. ఐసోలేషన్ వార్డులకు తగిన విధంగా కోచ్ ను తయారు చేస్తున్నారు. కేవలం నాన్‌ ఏసీ కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా రూపోందిస్తుంది. పేషెంట్‌ క్యాబిన్‌ రూపకల్పనకు కోచ్‌లో ఒక వైపు ఉన్న మూడు బెర్త్‌ల్లో మిడిల్‌ బెర్త్‌ను తీసేశారు. మరో వైపు ఉన్న మూడు బెర్త్‌లను పూర్తిగా తొలగించారు. పై బెర్త్‌ ఎక్కేందుకు ఉన్న నిచ్చెన వంటి సదుపాయాలను తొలగించారు. బాత్‌రూంలను, ట్యాప్‌లను మార్పు చేశారు. ప్రతీ క్యాబిన్‌కు ప్రత్యేక కర్టెన్లు ఏర్పాటు చేశారు.

నమూనా ఖరారైతే మాత్రం ప్రతి జోన్‌లో ప్రతి వారం పది బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలని రైల్వే యోచిస్తోంది. "రోగులు సౌకర్యవంతంగా కోలుకోవడానికి రైల్వేలు శుభ్రమైన, పరిశుభ్రమైన పరిసరాలను అందిస్తాయి" అని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ శనివారం చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కరోనావైరస్ యొక్క వ్యాప్తిని తగ్గించేందుకు గాను భారతదేశం ప్రస్తుతం 21 రోజుల లాక్డౌన్లో అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మాత్రం కఠినమైన చర్యలు లేనప్పుడు వ్యాధి పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories