పెరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల హీటు

Indian Presidential Election 2022 | Telugu News
x

పెరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల హీటు

Highlights

*రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి నిలపడమే లక్ష్యం

Indian Presidential Election 2022: దేశంలో రాష్ట్రపతి ఎన్నికల హీటు పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు నిర్వమించే సమావేశానికి హాజరవుతున్నట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది. సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే జైరామ్‌ రమేశ్‌, రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది. విపక్ష పార్టీలు కలిసికట్టుగా ఒకే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి రావాలంటూ మమతా బెనర్జీ 22 మంది నేతలకు లేఖలను రాశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కూడా దీదీ ఆహ్వానం పంపారు. అయితే కాంగ్రెస్ కూడా విపక్షాలను ఏకం చేసి శరద్‌ పవర్‌ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని భావించింది. అందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాష్ట్రపతి ఎన్నికలకు శరద్‌ పవార్ విముఖత వ్యక్తం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్‌ దీదీ సమావేశానికి ఓకే చెప్పింది.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జూలై 24నతో ముగియనున్నది. అంతకు మూడ్రోజుల ముందే జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు అవసరమైనంత మెజార్టీ బీజేపీకి లేదు. 2017లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ హయాంలో రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజేడీ మద్దతు ఇచ్చాయి. దీంతో రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పట్లో యూపీఏ ఆధ్వర్యంలో మీరా కుమార్ రామ్‌నాథ్‌ కోవింద్‌పై పోటీ చేశారు. మొత్తం 50 శాతం ఓట్లతో రామ్‌నాథ్‌ విజయం సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories