కోవిడ్ వారియర్స్‌కు ఇండియన్ కోస్ట్ గార్డ్ సెల్యూట్

కోవిడ్ వారియర్స్‌కు ఇండియన్ కోస్ట్ గార్డ్ సెల్యూట్
x
Indian Coast Guards
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు కోస్ట్ గార్డ్ సెల్యూట్ చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు కోస్ట్ గార్డ్ సెల్యూట్ చేసింది. సముద్రంలో షిప్‌ల మీద విద్యుత్ దీపాలు వెలిగించి జేజేలు పలికింది. కోస్ట్ గార్డ్ లు సముద్రంలో షిప్‌ల మీద విద్యుత్ లైట్లు వెలిగించి ధన్యవాదాలు తెలిపారు.

ఇవాళ ఉదయం కరోనా వారియర్స్ కు కృత‌జ్ఞతలు తెలిపాయి భారత త్రివిధ దళాలు. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై ఆదివారం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పూలవర్షం కురిపించాయి. ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకూ ఫైటర్ విమానాలైన సుఖోయ్ - 30, మిగ్ - 29, జాగ్వార్ తదితర విమానాలు, ఫైటర్ చాపర్లు ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఆకాశ పరేడ్ ను నిర్వహించాయి.

ప్రతి జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రిలపై యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో పరేడ్ చేస్తూ, పూలవర్షం కురిపించాయి. హైదరాబాద్ లోని గాంధీ ఆసుత్రిపై కూడా పూల వర్షం కురిపించాయి. విశాఖలోని కేజిహెచ్ , గీతం ఆసుపత్రులపై కూడా పూల వర్షం కురిపించింది.

దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా వాయుసేన సైతం ఎన్నో చర్యలు చేపట్టింది. 600 టన్నుల వైద్య పరికరాలను రవాణా చేయడంమే కాకుండా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని తమ ప్రాంతాల నుంచి ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులకు, టెస్టింగ్ ల్యాబ్ లకు చేర్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories