రైల్వేశాఖ నుంచి పీఎం సహాయ నిధికి రూ.151కోట్ల విరాళం

రైల్వేశాఖ నుంచి పీఎం సహాయ నిధికి రూ.151కోట్ల విరాళం
x
Representational Image
Highlights

కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు భారీ విరాళాలు వస్తున్నాయి.

కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు భారీ విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇక తాజాగా ప్రధానమంత్రి సహాయ నిధికి ఆర్మీ, నేవీ మరియు భారత వైమానిక దళంతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు సుమారు 500 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. . ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

'ప్రధాని మోదీ పిలుపు మేరకు నేను, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగాడి మా ఒక్క నెల జీతాన్ని, 13లక్షల మంది రైల్వే , పీఎస్‌యూ ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతానాన్ని విరాళంగా ఇస్తున్నాం. రూ. 151 కోట్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందజేస్తాం'అని పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక నెల జీతం ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రధాని సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్ (పిఎం-కేర్స్) ను ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇక ఇప్పటివరకు, భారతదేశంలో మొత్తం 979 సానుకూల కేసులు మరియు 25 మరణాలు నమోదయ్యాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories