Indian Air Force Day: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 90వ వార్షికోత్సవం

Indian Air Force Day in Chandigarh
x

Indian Air Force Day: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 90వ వార్షికోత్సవం

Highlights

Indian Air Force Day: చండీఘర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే

Indian Air Force Day: ఛండీగఢ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారతీయ వైమానిక దళం 90వ వార్షిక దినోత్సవం సందర్భంగా.. అద్భుతమైన ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. దాదాపు 80 విమానాలతో ఎయిర్ షోను నిర్వహించారు. ఇక ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. కొత్త యూనిఫామ్‌ను కూడా విడుదల చేయనుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. US, చైనా, రష్యా తర్వాత ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వైమానిక దళం. భారత వైమానిక దళం అధికారికంగా 1932 అక్టోబర్ 8న స్థాపించబడింది. దీని మొదటి AC ఫ్లైట్ 1933 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. అందువల్ల భారతీయుల్లో అవగాహనను పెంచేందుకు ఈ దినోత్సవాన్ని అధికారికంగా 1932 సంవత్సరంలో అక్టోబర్ 8న ప్రారంభించారు. వైమానిక దళం క్యాడెట్‌లచే నిర్వహించబడే ఎయిర్ షోలు, పరేడ్‌లతో దేశవ్యాప్తంగా వైమానిక దళ స్థావరాలలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. IAF భారత గగనతలాన్ని సురక్షితంగా ఉంచడంతోపాటు ఏదైనా ఘర్షణ సమయంలో వైమానిక యుద్ధాన్ని నిర్వహించడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories