Indian Air Force: ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో భారత్‌ అప్రమత్తం

Indian Air Force Alerted by Afghanistan Taliban and Bought 70 Thousand AK103 Rifles from Russia | India News Today
x

ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో భారత్‌ అప్రమత్తం

Highlights

Indian Air Force: * ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న తాలిబన్ల అరాచకాలు * కాబూల్‌ ఎయిర్‌పోర్టును దిగ్బంధించిన ముష్కర ముఠా

Indian Air Force: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. కాబూల్‌ ఎయిర్‌పోర్టు దగ్గర రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టిన ఈ ముష్కర ముఠా.. ఎయిర్‌పోర్టును దిగ్బంధించింది. ప్రజలెవరూ రాకుండా అడ్డుకునేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గాల్లో మరిన్ని చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఆఫ్ఘన్‌ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో కాబూల్ రహదార్లపై గస్తీ కాస్తున్నారు తాలిబన్లు.

ఆఫ్ఘన్ ప్రజలు ధైర్యం చేసి కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తు్న్నారు. కానీ.. వారికి ఫలితం దక్కడం లేదు. ఒక చెక్‌పోస్ట్‌ దగ్గర కాకపోతే మరో చెక్‌పోస్ట్‌ దగ్గర తాలిబన్లు వారిని అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు దిక్కుతోచని స్థితిలో గడుపుతున్నారు. ఆఫ్ఘన్‌ నుంచి తరలింపు ఆగిపోతే.. తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగానే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్.. దేశ ఆయుధ సంపత్తిని పెంపొందించుకునే చర్యలను మరింత వేగవంతం చేసింది. రష్యా నుంచి 70వేల ఏకే-103 రైఫిళ్లను అత్యవసరంగా కొనుగోలు చేసింది. వీటి ద్వారా ఉగ్రదాడులను నియంత్రించేందుకు భద్రతా బలగాలు మరింత శక్తిమంతమవుతాయని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్​, శ్రీనగర్ వంటి సున్నిత ప్రాంతాలు, వాయుసేన స్థావరాల వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి తొలుత వీటిని అందించనున్నట్లు భారత వాయుసేన తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories