DRDO: అభ్యాస్‌ ఎయిర్‌క్రాప్ట్‌ టెస్ట్‌ సక్సెస్‌

India Successfully Tests High-Speed Expendable Aerial Target Abhyas Off Odisha Coast
x

DRDO: అభ్యాస్‌ ఎయిర్‌క్రాప్ట్‌ టెస్ట్‌ సక్సెస్‌

Highlights

DRDO: ఒడిషాలోని చాందీపూర్‌లో పరీక్షించిన డీఆర్‌డీవో

DRDO: అభ్యాస్ పేరుతో తక్కువ ఎత్తులో దూసుకెళ్లే ఎయిర్‌క్రాప్ట్‌-హీట్‌ను డీఆర్డీవో విజ‌యవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ ప‌రీక్ష జ‌రిగింది. పరీక్షలో ఎయిర్‌క్రాఫ్ట్‌ను అతి త‌క్కువ ఎత్తులో ప‌రీక్షించారు. ఈ ప‌రీక్ష నిర్వ‌హించిన స‌మ‌యంలో సెన్సార్లు ఆ ఏరియ‌ల్ టార్గెట్‌కు చెందిన రాడర్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఆప్టిక‌ల్ సిస్ట‌మ్‌ను ట్రాక్ చేశాయి. ట్విన్ బూస్ట‌ర్ల‌తో ఈ ఎయిర్ వెహికిల్ ప‌నిచేస్తుంది. అయితే సుదీర్ఘ దూరం ప్ర‌యాణించేందుకు ఆ వాహ‌నంలో గ్యాస్ ట‌ర్బైన్ ఇంజిన్‌ను అమ‌ర్చారు. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ డిఫెన్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్, డీఆర్డీవో కలిసి అభ్యాస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను డెవ‌ల‌ప్ చేశాయి. అభ్యాస్‌ విజయవంతమవడంపై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోకు కంగ్రాట్స్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories