Chandrayaan 3: చందమామ అందిన రోజు.. భరతజాతి మురిసిన రోజు

India Records Chandrayaan-3 Successfully Lands Moon
x

Chandrayaan 3: చందమామ అందిన రోజు.. భరతజాతి మురిసిన రోజు

Highlights

Chandrayaan 3: వీర విక్రమ..చంద్ర దిగ్గజ..జయహో అంటూ నినదించిన ఇండియన్స్‌

Chandrayaan 3: 42 రోజుల నిరీక్షణ ఫలించింది. ఇస్రో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అంతరిక్ష పరిశోధనలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చెరిగిపోని రికార్డ్ ను రచించింది. తొలిసారి చంద్రుడిపైన ఓ రోవర్ ను దించింది. జాబిల్లిపై మన జెండాను పాతింది. మూన్ మిషన్ ద్వారా మన శాస్త్రవేత్తలు తమ మేథకు పదునుపెట్టి చంద్రుడి దక్షిణ ధృవంపై మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. ఏమైతేనేం చంద్రునిపై ఏకంగా ఓ రోవర్ ను దించాలన్న ఇస్రో లక్ష్యం, భారతీయుల కల రెండూ నెరవేరాయి. ప్రపంచ దేశాల ముందు ప్రతీ భారతీయుడు గర్వంగా తలెత్తుకొని జయహో భారత్ అంటూ నినదిస్తున్నాడు.

ప్రపంచ పటంపై మన దేశ జెండా మరోసారి రెపరెపలాడింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రగ్రహంపైకి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్ అయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వాహకనౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రో చంద్రగ్రహంపైకి ఆర్బిటార్ , ల్యాండ ర్ , రోవర్ ను ప్రవేశపెట్టి చరిత్రను తిరగరాసింది.

భారత కీర్తికిరీటంలో కచ్చితంగా ఇది ఒక మణిహారమే. చంద్రుడిపై రహస్యాలను శోధించి మరోసారి భారత జెండాను రెపరెపలాడించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు, అక్కడి ఖనిజ వనరులు, నీరు, ఇంధన నిల్వలను విశ్లేషించేందుకు చంద్రయాన్-3ను చేపట్టిన ఇస్రో జులై 14న ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 3... తారాజువ్వ ఆకాశంలోకి దూసుకెళ్తుంటే చూసి ప్రతీ భారతీయుడు ఆనందపడ్డాడు. ఇది సక్సెస్ కావాలని ఆనాడే సంకల్పం చెప్పుకున్నాడు.

ఇస్రో సాధించిన మరో గగన విజయమిది. రోదసిలో రహస్యాలశోధనకు ప్రపంచశ్రేణి అగ్రదేశాలకే పరిమితమైన చంద్రునిపై కాలుమోపింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప ట్ట ిన ఈ అంత రిక్ష ప్రయోగంతో.. ప్రపంచ దేశాలను త న వైపు ఆక ర్షించింది. వినీలాకాశంలో, అనంత అంత రిక్షంలో మువ్వెన్నల జెండాను భార త అంత రిక్ష ప రిశోధ న సంస్థ ఎగరేసింది. ఇప్పటి వ ర కు చంద్రుడిపై ఎవ్వరూ శోధించ ని ప్రాంతంలో భార త్ రోవర్ ను దింపింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన చంద్రయాన్ 3 ప్రయోగం ఐదు ద శ ల్లో జ ర గ నుంది. మెద టి ద శ లో జీఎస్ఎల్ వీ2 మార్క్ 3 వాహ క నౌక 5 రోజుల పాటూ ప్రయాణించి భూ నియంత్రణ కక్ష్యలోకి ప్రవేశించింది.

రెండోద శ లో భూ నియంత్రణ క క్ష్యలో నుంచి 3.5ల క్షల కిలోమీట ర్లు చంద్రుని వైపునకు ప్రయాణం సాగింది. మూడోద శ లో రాకెట్ నుంచి విడిపోయిన ఆర్బిటార్ , రాడ ర్ , ల్యాండర్లు చంద్రుని ద క్షిణ ధృవం వైపుకు మళ్లాయి. నాలుగో ద శ లో చంద్రుడికి 30 కిలోమీట ర్ల దూరంలో ఆర్బిటార్ నుంచి ల్యాండ ర్ విడిపోయింది. ఈ ద శ ఎంతో క్లిష్టమైన కీల క మైన ద శ. ఇక చివ రిదైన 5వ దశలో ల్యాండర్ ద్వారాల నుంచి బయటకు వెళ్లే రోవ ర్ , చంద్రుడిపై కాలుమోపింది. భారత్ కీర్తి పతాకను రెపరెపలాడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories