బ్రెజిల్ ను వెనక్కినెట్టి రెండో స్థానంలోకి భారత్..

బ్రెజిల్ ను వెనక్కినెట్టి రెండో స్థానంలోకి భారత్..
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ చైనా మినహా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ చైనా మినహా అన్ని దేశాల్లో ఎంతోకొంత సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. రెండు దేశాల్లో కలిపి 50 కోట్ల మంది జనాభా ఉన్నా.. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ రెండు దేశాల తరువాత ఆ స్థాయిలో కేసులు నమోదు అవుతున్న దేశం మాత్రం ఇండియానే.. గతవారం రోజుల నుంచి రోజుకు సగటున 80వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే కోవిడ్-19 మరణాలు కూడా వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయి. తాజాగా, భారత్ మరో రికార్డును అధిగమించింది.

ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదయిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉండగా ఇప్పుడు బ్రెజిల్ ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి ఎగబాకింది. దేశంలో 41 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 70వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ అమెరికా తర్వాతి రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో 40,93,580 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. వీరిలో 1,25,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, 64 లక్షల కేసులతో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో మొత్తం 1,88,00 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే భారత్‌లో గడచిన 24 గంటల్లో 90,632 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో మొత్తం కేసులు 41 లక్షలు దాటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories