India mock drill: మాక్ డ్రిల్స్ అంటే ఏంటి..? గతంలో వీటిని ఎలా నిర్వహించారు..యుద్ధ సన్నాహాలు ఇక మొదలైనట్లేనా..?

India mock drill
x

India mock drill: మాక్ డ్రిల్స్ అంటే ఏంటి..? గతంలో వీటిని ఎలా నిర్వహించారు..యుద్ధ సన్నాహాలు ఇక మొదలైనట్లేనా..?

Highlights

India mock drill: మాక్ డ్రిల్ అనేది భద్రతా దళాలు అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు ప్రజలను సన్నద్ధం చేసేందుకు అత్యవసర సమయాలు ఎలా స్పందించాలి అనే విషయాలను వారికి అర్థమయ్యేలా తెలియజేస్తుంది. . ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశం పైన మాక్ డ్రిల్ లో ముందుగానే తెలియజేస్తారు.

India mock drill: మాక్ డ్రిల్ అనేది భద్రతా దళాలు అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు ప్రజలను సన్నద్ధం చేసేందుకు అత్యవసర సమయాలు ఎలా స్పందించాలి అనే విషయాలను వారికి అర్థమయ్యేలా తెలియజేస్తుంది. . ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశం పైన మాక్ డ్రిల్ లో ముందుగానే తెలియజేస్తారు. ముఖ్యంగా యుద్ధం వంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు పౌరులకు ప్రాణ నష్టం కలగకుండా ఎవరికి వారు ప్రభుత్వం తెలిపిన సురక్షితమైన తగు జాగ్రత్తలను తీసుకున్నట్లయితే సంక్షోభ సమయంలో కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ ఎలా నిర్వహిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనదేశంలో 1971లో తొలిసారిగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అప్పట్లో పాకిస్తాన్ పైన భారత్ యుద్ధానికి దిగినప్పుడు తొలిసారిగా ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత మరోసారి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. . ఇందులో భాగంగా మొత్తం దేశంలోని 259 లొకేషన్ లో మాక్ డ్రిల్ నిర్వహించునున్నారు. గతంలో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కేవలం పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. . అయితే ఈసారి తొలిసారిగా దేశమంతా మరోసారి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.

ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ లో బాగంగా పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం తో పాటు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వాలంటీర్లు, వైద్య సిబ్బంది, స్కూళ్లు కాలేజీలు, ఎన్‌సీసీ సభ్యులు, ఎన్ఎస్ఎస్ సభ్యులు భాగస్వామ్యం అవ్వడంతో పాటు సాధారణ పౌరులకు అవగాహన కల్పించేందుకు వీరిని ఉపయోగించుకుంటారు.

>> ముఖ్యంగా విదేశీ శక్తులు గగన తలం నుంచి దాడులు జరిపినప్పుడు మన సన్నద్ధతను అంచనా వేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.

>> అలాగే ఎయిర్ ఫోర్స్ హాట్ లైన్ ద్వారా, రేడియో కమ్యూనికేషన్ సన్నద్ధతను అంతనవేస్తుంది.

>> పోలీసులు కంట్రోల్ రూమ్ అలాగే, షాడో కంట్రోల్ రూమ్ లు ఎలా పనిచేస్తున్నాయో సన్నద్ధతను తెలుసుకోవచ్చు.

>> ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ లో ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్ పోస్టులు, విద్యుత్ స్టేషన్లు, ఇతర కమ్యూనికేషన్ హబ్స్ లలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.

>> అలాగే ఎయిర్ అటాక్స్ నుంచి తప్పించుకునేందుకు సైరన్ వ్యవస్థ పనితీరును అంచనా వేస్తారు.

>> అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స ఎలా నిర్వహించాలి, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి వంటి విషయాలను మాక్ డ్రిల్ ద్వారా తెలియజేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories