వ్యాక్సిన్‌ ప్రక్రియలో భారత్ అరుదైన మైలురాయి

India is a rare milestone in the vaccine process
x

వ్యాక్సిన్‌ ప్రక్రియలో భారత్ అరుదైన మైలురాయి

Highlights

Vaccine: కోవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా చేపట్టిన వ్యాక్సిన్‌, ప్రక్రియలో భారత్‌ అరుదైన మైలురాయికి చేరింది. దేశంలోని 75 శాతం మంది వయోజనులకు రెండు డోసుల టీకా పంపిణీ పూర్తయింది.

Vaccine: కోవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా చేపట్టిన వ్యాక్సిన్‌ ప్రక్రియలో భారత్‌ అరుదైన మైలురాయికి చేరింది. దేశంలోని 75 శాతం మంది వయోజనులకు రెండు డోసుల టీకా పంపిణీ పూర్తయింది. దీంతో టీకా తీసుకున్నవారికి ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం గర్వంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు 164 కోట్ల 36 లక్షల టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. అందులో 12 కోట్ల 43 లక్షల 49వేల మంది టీకాను వినియోగించుకున్నట్టు చెప్పారు. సబ్‌కా సాత్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రంతో ఈ టీకా కార్యక్రమం చేపట్టామన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో మనం మరింత బలంగా మారామని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పష్టం చేశారు

కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు దేశ వ్యాప్తంగా 2021 జనవరి 16న టీకా కార్యక్రమం మొదలయింది. థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో 15 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు కూడా టీకా పంపిణీ జనవరి 1 నుంచి మొదలయ్యింది. వృద్ధులకు బూస్టర్‌ డోసును కూడా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories