భారత్ లో ఆ మూడు 'కరోనావైరస్' కేసులు మినహా కొత్తవి నమోదు కాలేదు : కేంద్రం

భారత్ లో ఆ మూడు కరోనావైరస్ కేసులు మినహా కొత్తవి నమోదు కాలేదు : కేంద్రం
x
Highlights

ఇప్పటివరకు చైనాలోని వుహాన్ నగరం నుండి 645 మంది భారతీయుల్ని తరలించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.. వారిని ఐసోలేషన్ లో ఉంచడం కోసం గుర్గావ్...

ఇప్పటివరకు చైనాలోని వుహాన్ నగరం నుండి 645 మంది భారతీయుల్ని తరలించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.. వారిని ఐసోలేషన్ లో ఉంచడం కోసం గుర్గావ్ మానెసర్ ప్రాంతంలోని ఆర్మీ బేస్ క్యాంపు లో ఉంచినట్టు స్పష్టం చేసింది. అలాగే కొంతమందిని ఢిల్లీలోని ఐటిబిపి శిబిరాలకు తరలించినట్టు తెలియజేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో 1,265 విమానాల నుండి 1,38,750 మంది ప్రయాణికులు ప్రయాణించారని.. వీరందరికి వైరస్ సంక్రమణ పరీక్షలు చేశారని కానీ వారిలో ఎవరికీ సంక్రమించలేదని తెలిపింది. అయితే వైరస్ సంక్రమణకు సంబంధించిన మూడు కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

వ్యాప్తి తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ముగ్గురు కేరళ వైద్య విద్యార్థులు వైరస్సంక్రమణపైపరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలిందని చెప్పింది. అంతేకాకుండా, 510 నమూనాలను ఐసిఎంఆర్ నెట్‌వర్క్ ప్రయోగశాలలు పరీక్షించారని.. వీరిలో ఎవ్వరికి ప్రమాదం లేదని.. నమోదైన ఈ మూడు కేసులు కూడా వైద్యపరంగా స్థిరంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఆరోగ్యం, గృహ, పౌర విమానయాన మరియు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కరోనావైరస్ నుండి తలెత్తే పరిస్థితిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

చైనా నుండి వైరస్ లక్షణం లేని ప్రయాణికులకు అవసరమైన సమీక్షా కాలపరిమితితో సహా వివిధ సాంకేతిక అంశాలపై చర్చించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్ఎస్) ఆధ్వర్యంలో నాల్గవ జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (జెఎంజి) సమావేశం గురువారం జరిగింది. అన్ని రాష్ట్రాలు / యుటిలలో 6,558 మంది చేత కమ్యూనిటీ నిఘా మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ ను ఐడిఎస్పి నిర్వహిస్తోంది. భారతదేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ కంట్రోల్ కు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖలు సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories