Corona: కరోనా మరణాల్లో మూడోస్థానానికి భారత్

India Becomes 3rd Nation After US, Brazil To Cross 3 Lakh COVID Deaths
x

Representational Image

Highlights

Corona: కరోనా మరణాల్లో ప్రపంచంలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది.

Corona: కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు అమెరికాను చూసి మనం జాలిపడ్డాం. ఇప్పుడు ప్రపంచమంతా మనలను చూసి జాలిపడుతోంది. మరణాల సంఖ్య 3 లక్షలు దాటడంతో సెకండ్ వేవ్ మనలని ఎంతటి ప్రమాదంలోకి నెట్టేసిందో అర్ధమవుతోంది. ఇప్పుడు కరోనా మరణాల సంఖ్యలోనే మనం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలబడ్డాం. అమెరికా, బ్రెజిల్ తర్వాత స్థానం ఇండియాదే. అమెరికాలో 5 లక్షల 83 వేల మంది చనిపోగా.. బ్రెజిల్ లో ఇప్పటివరకు 4 లక్షల 46 వేల మంది చనిపోయారు. ఆ తర్వాత భారత్ లోనే అత్యధికంగా 3 లక్షల మందికిపైగా కరోనాతో మరణించారు.

కరోనా సెకండ్ వేవ్ మన దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే.. కరోనా ఫ‌స్ట్ వేవ్ భీక‌ర ప్ర‌ళ‌యాన్ని సృష్టించ‌క‌పోయినా.. సెకెండ్ వేవ్ అతలాకుతలం చేస్తుంది. కేసుల సంఖ్య కాస్త త‌గ్గినప్ప‌టికీ.. నిత్యం క‌రోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. క‌రోనా మృతుల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే మూడవ స్థానానికి చేరకుంది. తాజగా దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడు లక్షలు దాటింది. దీనికిముందు అమెరికా, బ్రెజిల్‌లో కరోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య మూడు లక్షలు దాటింది. నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో క‌రోనా వైర‌స్ సోకి ఇప్పటివరకూ 2,99,266 మంది మృతి చెందారు. దీనికి రాష్ట్రాల నుంచి వ‌చ్చిన తాజా డేటాను జ‌త‌చేస్తే ఈ సంఖ్య మూడు లక్షలు దాటినట్లు ఆరోగ్యశాక వెల్లడించింది.

కాగా దేశంలో అత్య‌ధిక మంది మహారాష్ట్రలో మరణించారు. మహారాష్ట్రలో దాదాపు 90వేల మంది మరణించారు. కర్ణాటకలో 24వేల మంది, ఢిల్లీలో 23 వేలు, తమిళనాడులో 20వేలకు పైగా మరణించారు. అయితే.. దేశంలో కరోనా కారణంగా మరణించిన వారిలో 70 శాతానికి పైగా బాధితులు ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన ప‌డిన‌వారేన‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికిముందు ప్రపంచంలో అత్యధిక కోవిడ్ కేసులు న‌మోదైన‌ దేశాల్లో భారతదేశం కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories