బీజేపీ నేత ఫిర్యాదు.. అర్ధరాత్రి ఎమ్మెల్యే అరెస్ట్..

బీజేపీ నేత ఫిర్యాదు.. అర్ధరాత్రి ఎమ్మెల్యే అరెస్ట్..
x
Highlights

రాష్ట్ర బిజెపి ప్రతినిధిని బెదిరించాడనే ఆరోపణలతో గోవా పోలీసులు స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖౌంటేను అరెస్టు చేశారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని...

రాష్ట్ర బిజెపి ప్రతినిధిని బెదిరించాడనే ఆరోపణలతో గోవా పోలీసులు స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖౌంటేను అరెస్టు చేశారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బిజెపి రాష్ట్ర ప్రతినిధి ప్రేమానంద్ మహాంబ్రే బుధవారం ఖౌంటేపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు అసెంబ్లీ స్పీకర్‌కు కూడా ఆయన ఫిర్యాదును సమర్పించారు. దాంతో ఖౌంటేను అర్థరాత్రి అరెస్టు చేసినట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ (పోర్వోరిమ్) ఎడ్విన్ కోలాకో తెలిపారు.

అయితే, మరిన్ని వివరాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. కాగా శాసనసభ స్పీకర్ రాజేష్ పట్నేకర్‌ను గోవా పోలీసులు సంప్రదించిన తరువాత ఖౌంటేను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం అసెంబ్లీ సెషన్‌ ఉన్నందున స్పీకర్ అనుమతి అవసరం ఉంటుందని పోలీసులు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 7 తో ముగుస్తుంది. ఈలోపే ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు ప్రభావవంతమైన వ్యక్తి అలాగే ఎన్నుకోబడిన ప్రతినిధి అని స్పీకర్ ముందు పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఫిర్యాదుదారుడు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి, కావడంతో ఈ పరిణామం ఇబ్బందులకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో మాజీ రాష్ట్ర రెవెన్యూ మంత్రిని భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 341 (తప్పుడు నియంత్రణ) మరియు 323 కింద అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బుధవారం పిర్యాదుదారుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఖౌంటే అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. అంతేకాదు బిజెపి గోవా యూనిట్ చీఫ్ ను కూడా ఖౌంటే బెదిరించాడని ఆరోపించారు. ఇదిలావుంటే గత ఏడాది ప్రారంభంలో ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని మంత్రివర్గం నుండి ఖౌంటేను తొలగించారు. ఈ ఆరోపణలు కేసుపై ఖౌంటే బుధవారం స్పందించారు.. మహాంబ్రేను బెదిరించానను వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఖండించారు. "నేను ఎవరినీ తాకలేదు. మేము ప్రభుత్వ తప్పిదాలను సభలో బహిర్గతం చేస్తున్నందున బిజెపి నిరాశకు గురైంది, అందువల్ల వారు ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories