పెరుగుతున్న 'ఫాస్టాగ్‌' వినియోగం

పెరుగుతున్న ఫాస్టాగ్‌ వినియోగం
x
Highlights

టోల్ గేట్ల వద్ద ఆలస్యం కాకుండా వేగంగా వెళ్లేందుకు కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన ఫాస్ట్ టాగ్ వినియోగం కరోనా పుణ్యమాని పెరుగుతూ వస్తోంది.

టోల్ గేట్ల వద్ద ఆలస్యం కాకుండా వేగంగా వెళ్లేందుకు కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన ఫాస్ట్ టాగ్ వినియోగం కరోనా పుణ్యమాని పెరుగుతూ వస్తోంది.దీనిని గత ఏడాది చివర్లో ప్రవేశపెట్టినా ఆశించిన స్థాయిలో వాహన యాజమానులు వినియోగించేందుకు అసక్తి చూపలేదు. ఇంతవరకు ఉన్న మాదిరిగానే నగదు చెల్లించి, టోల్ ప్లాజా రశీదు తీసుకునేవారు. అయితే కరోనా నేపధ్యంలో నగదు నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రచారం రావడంతో ప్రత్యామ్నాయంగా ఇంతవరకు పట్టించుకోని ఫాస్ట్ టాగ్ ను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వేగంగా చెల్లింపులు జరిపి, వాహనాలు తొందరగా వెళ్లేందుకు దోహద పడుతోంది.

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో వాహనాల జోరు పెరిగింది. , విజయవాడ, హైదరాబాద్‌, విశాఖపట్నంలలో పెద్దసంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇక ఔటర్‌ రింగురోడ్డులోనూ వెహికిల్స్‌ దూసుకుపోతున్నాయి. అయితే ఓఆర్‌ఆర్‌పై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్‌ వినియోగం బాగా పెరిగింది. డబ్బులిచ్చి రసీదు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండనే భావనతో.. చాలా మంది ఫాస్టాగ్‌నే వినియోగిస్తున్నారు.

టోల్‌ప్లాజాల దగ్గర గతంతో పోల్చితే 40 శాతం ఫాస్టాగ్‌ కార్డుల వినియోగం పెరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మనీ చెలామణి తగ్గి క్యాష్‌లెస్‌ పేమెంట్‌కే వాహనదారులు మొగ్గుచూపుతున్నారు. ఫాస్టాగ్‌ వల్ల మనీ కూడా సేవ్‌ అవుతుందని ఓఆర్‌ఆర్‌ సిబ్బంది చెబుతున్నారు. ఫాస్ట్‌టాగ్‌ వాడడం వల్ల రిటర్న్‌ జర్నీకి మనీ తక్కువ పడుతుందని అంటున్నారు. మొత్తమ్మీద ఫాస్టాగ్‌ వినియోగం పెరుగుతుండడం చెప్పుకోదగ్గ విషయమే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories