కరోనా టెస్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేంద్రం

కరోనా టెస్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేంద్రం
x
Highlights

మహారాష్ట్రలో కరోనా రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, కేంద్రం పదేపదే హెచ్చరించినప్పటికీ కరోనా పరీక్షల సంఖ్య పెంచడం లేదని.. ఇది తీవ్రమైన..

మహారాష్ట్రలో కరోనా రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, కేంద్రం పదేపదే హెచ్చరించినప్పటికీ కరోనా పరీక్షల సంఖ్య పెంచడం లేదని.. ఇది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని, కరోనా మహమ్మారి గుండె జబ్బులు, మరణాలు రెండింటినీ పెంచుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాల్లో మహారాష్ట్ర కంటే కరోనా పరీక్షలు ఎక్కువ చేస్తున్నారు. ఇటీవల ఒక లేఖలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా ఇలా పేర్కొన్నారు.. సమయానుసారంగా చేసే పరీక్షల సంఖ్య రోగులను త్వరగా గుర్తించి వారి ప్రాణాలను కాపాడవచ్చు అని అన్నారు.

మహారాష్ట్రలో, 1 మిలియన్ ప్రజలకు గాను 42,000 ప్రభుత్వ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ రేటు 21.5 శాతంగ ఉంది. గత వారం, మిలియన్ మందికి సగటున పరీక్షలు చేయడాన్ని చూసినప్పుడు, ప్రతిరోజూ 377 పరీక్షలు మాత్రమే జరుగుతున్నట్లు కనుగొనబడింది, ఇది చాలా తీవ్రమైన విషయం అని అన్నారు. దీని పర్యవసానంగా పాజిటివ్ రేటు పెరుగుతోందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో 539 పరీక్షా ప్రయోగశాలలు ఉన్నాయి, వీటిలో 218 ప్రయోగశాలలలో 100 కంటే తక్కువ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగశాలల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. వారి షిఫ్ట్ నుండి సరైన నిర్వహణ కోసం తగిన సిబ్బందిని నియమించాలని కూడా కేంద్రం కోరింది. కాగా మహారాష్ట్రలో 12 కోట్లకు పైగా జనాభా ఉంటే.. ఇప్పటివరకు 58 లక్షల 72 వేల పరీక్షలు జరిగాయి, ఇందులో 12 లక్షల ఎనిమిది వేల మంది మందికి వ్యాధి సోకింది.

Show Full Article
Print Article
Next Story
More Stories