AICC President Election: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక.. బరిలో మల్లికార్జునఖర్గే, శశిథరూర్

In Congress Party All Set For Congress Party President Election
x

AICC President Election: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక.. బరిలో మల్లికార్జునఖర్గే, శశిథరూర్ 

Highlights

AICC President Election: ఉ.10 నుంచి సా.4 వరకు ఓటింగ్.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు

AICC President Election: కాసేపట్లో దేశ వ్యాప్తంగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంకా గాంధీ, సీనియర్ నేతలు, కొద్దిమంది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఓటు వేయనున్నారు. బెంగుళూరు లో మల్లికార్జున ఖర్గే, త్రివేండ్రంలో శశిధరూర్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని సుమారు 9 వేల మందికి పైగా పీసీసీ డెలిగేట్లు ఓటు వేయనున్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ లో ఢిల్లీ రాష్ట్రానికి చెందిన డెలిగేట్స్ ఓటు వేయనున్నారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలు వెల్లడిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories