Importance of Masks Usage: సక్రమంగా వాడకపోతే ప్రమాదమే.. పూర్తిస్థాయిలో వినియోగం 10శాతమే

Importance of Masks Usage: సక్రమంగా వాడకపోతే ప్రమాదమే.. పూర్తిస్థాయిలో వినియోగం 10శాతమే
x
Masks Importance
Highlights

Importance of Masks Usage: కరోనా విలయాన్ని అపడంలో మాస్క్ కీలకపాత్ర పోషిస్తుంటుంది.

Importance of Masks Usage: కరోనా విలయాన్ని అపడంలో మాస్క్ కీలకపాత్ర పోషిస్తుంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా పట్టనట్టు వ్యవహరిస్తారు. కొంతమంది మాస్క్ వేసుకున్నట్టు కనిపించినా దాన్ని సక్రమమైన రీతిలో వాడకపోవడం వల్ల దాని ద్వారానే కరోనాను తీసుకొచ్చే ప్రమాదముందని తెలుసుకోరు. దీనిపై నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వైరస్‌ వ్యాప్తి నిరోధానికి నిర్దేశిత జాగ్రత్తలతో మాస్కు ధరించాలని వైద్యసంస్థలు ఎంతగా మొత్తుకుంటున్నా.. శాస్త్రీయ పద్ధతిలో మా స్క్‌లు వాడుతున్న వారు 10 శాతంలోపేనని వైద్య, ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. క్షేత్రస్థాయిలో ప్ర జలు మాస్కులు ధరిస్తున్న తీరుపై వైద్య, ఆరోగ్యశా ఖ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గత జూలైలో ఇరవై రోజుల పాటు ఇరవై వేల మందిని పరిశీలించింది. ఇందులో 90% మంది నిబంధనలు పాటిం చట్లేదని తేలింది. చాలామంది ముక్కును వదిలేస్తూ, నోరు కవరయ్యేలా మాస్కు ధరిస్తున్నారు. ఇంకొందరు పేరుకు మాస్క్‌ ధరించినా.. దాన్ని గడ్డం కిందకు లాగేస్తున్నారు.

20వేల మందిలో 90శాతం మంది ఇదే తరహాలో మాస్కు పెట్టుకుంటున్నారు. ఇందులో 65% మంది మాస్కు ముందు భాగాన్ని తరచూ తాకుతున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తులతో మనం మాట్లాడితే ఆ వైరస్‌ మనం ధరించే మాస్క్‌ ముందుభాగానికి చేరుతుంది. ఈ క్రమంలో మా స్కు ముందుభాగాన్ని తాకినా, తిరిగి అదే చేతితో ముక్కు, నోటి భాగాన్ని తాకినా వైరస్‌ మనలోనికి చేరుతుంది. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో జాగ్రత్తలు పాటించని వాళ్లే 85 శాతం ఉన్న ట్లు వైద్యశాఖ పరిశీలన చెబుతోంది. ఇక, బాధి తుల్లో అత్యధిక మంది రద్దీ ప్రాంతాల్లో తిరిగి వైరస్‌ బారిన పడినవారేనని ఈ విశ్లేషణలో తేలింది.

'కరోనా వైరస్‌ నుంచి రక్షించే ప్రధాన ఆయుధం ఫేస్‌ మాస్కు. దీన్ని శాస్త్రీయ పద్ధతిలో ధరించి, జాగ్రత్తలు పాటిస్తే దాదాపు సురక్షితంగా ఉన్నట్టే. బయటకు వెళ్లేటపుడు, ఇతరులతో మాట్లాడేటపు డు ట్రిపుల్‌ లేయర్‌ మాస్కును ముక్కు, నోరు పూర్తిగా కవరయ్యేలా ధరించాలి. ఒకసారి మాస్కు పెట్టుకున్నాక ముందువైపు తాకొద్దు. మాస్కును చెవివైపు నాడెలను పట్టుకుని తొలగించి నేరుగా వేడినీటిలో వేసి ఉతికేయాలి. సబ్బు లేదా ఇతర డిటర్జెంట్‌ పౌడర్‌తో ఉతికి, 4 గంటల పాటు ఆరబెట్టాక వినియోగించాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories