సర్వర్‌ డౌన్‌ : ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయిన ప్రయాణీకులు

సర్వర్‌ డౌన్‌ : ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయిన ప్రయాణీకులు
x
Highlights

ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్‌ సిస్టమ్‌ సర్వర్‌ డౌన్ కావడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు...

ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్‌ సిస్టమ్‌ సర్వర్‌ డౌన్ కావడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున 12.20 గంటల ప్రాంతంలో ఇమిగ్రేషన్‌ సిస్టమ్‌ సర్వర్‌ 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ కారణంతో ప్రయాణీకులకు ఇమిగ్రేషన్‌ సమస్య తలెత్తింది. దీంతో ఇమిగ్రేషన్ చెక్‌ కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

కొందరు ప్రయాణీకులు ఇమిగ్రేషన్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొందని ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. ఎయిర్‌ఇండియా పాసింజర్‌ సర్వీస్‌ సిస్టమ్‌ ఇటీవల ఐదు గంటల పాటు మొరాయించిన కొద్దిరోజులకే ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోని ఇమిగ్రేషన్‌ సిస్టమ్‌ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories