క్షణాల్లో కూల్చేశారు

క్షణాల్లో కూల్చేశారు
x
క్షణాల్లో కూల్చేశారు
Highlights

కేరళ కొచ్చిలోని మరాడు ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన భవనాలను ప్రభుత్వం కూల్చివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు భారీ భవనాలను కూల్చివేయగా ఆదివారం...

కేరళ కొచ్చిలోని మరాడు ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన భవనాలను ప్రభుత్వం కూల్చివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు భారీ భవనాలను కూల్చివేయగా ఆదివారం మరో రెండు అక్రమ భవనాలను కూల్చివేశారు. కూల్చివేసిన 19 అంతస్థుల హోలీ ఫెయిత్ కాంప్లెక్స్‌లో 90 ఫ్లాట్స్ ఉండగా ఆల్ఫా సెరెన్ కాంప్లెక్స్‌లో 73 ఫ్లాట్స్ ఉన్నాయి. బ్యాక్ వాటర్స్‌కు సమీపంలోనే నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్మించారు. సమీపంలో ఉన్న భవనాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా క్షణాల వ్యవధిలోనే వీటిని కూల్చేశారు. నిబంధలను ఉల్లంఘించి నిర్మించిన భారీ భవనాలను కేరళ సర్కారు కూల్చేయడం ఇండియాలో చేపట్టిన అతిపెద్ద కూల్చివేతల్లో ఒకటిగా భావిస్తున్నారు.

కేరళ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి వీటిని నిర్మించినట్లు గుర్తించిన అధికారులు కూల్చివేశారు. నిర్వాసిత కుటుంబాలు మొదట వ్యతిరేకించినా అధికారులు ఒప్పించడంతో అడ్డంకులు తొలగిపోయాయి. ఈ అక్రమ కాంప్లెక్స్‌లను కూల్చివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

జనం గుమిగూడకుండా అధికారులు ఆంక్షలు విధించారు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేశారు. భవంతుల కూల్చివేత కారణంగా నిరాశ్రయులయ్యే కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని గతేడాది సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో బాధిత కుటుంబాల పునరావాసానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అపార్ట్‌మెంట్లు కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తొలుత అపార్ట్‌మెంట్ వాసులు నిరసన తెలిపారు. బిల్డర్ తప్పిదానికి తాము బాధితులు కావడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసిత కుటుంబాలను కేరళ ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పించడంతో భవనాల కూల్చివేత ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories