
IGNOU: బీఏ ఉర్దూ, బీఏ సంస్కృతం కోర్సులను ప్రారంభించిన ఇగ్నో..
IGNOU: బీఏ ఉర్దూ, బీఏ సంస్కృతం కోర్సులను ప్రారంభించిన ఇగ్నో..
IGNOU: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) రెండు కొత్త డిగ్రీ కోర్సులను ప్రారంభించింది. బీఏ ఉర్దూ, సంస్కృతం కోర్సులను ప్రారంభించింది. 2022 సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ రెండు కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ignouadmission.samarth.edu.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ కింద ఈ కోర్సుల ప్రారంభం జరిగింది. నిత్య జీవితంలో చాలామంది ఉర్దూపదాలు, సంస్కృత పదాలను తెలియకుండానే మాట్లాడుతుంటారు. ఎందుకంటే వివిధ భాషలలో ఈ పదాలు కలిసిపోయాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులలో చేరవచ్చు. స్కిల్ డెవలప్‌మెంట్, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE), ఇగ్నో ఇటీవల వృత్తి విద్య శిక్షణను ఉన్నత విద్యతో అనుసంధానించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశ యువతకు పని అవకాశాలను సృష్టించడం, వృత్తిపరమైన సాంకేతిక శిక్షణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
అధికారిక ప్రకటన ప్రకారం దాదాపు 32 NSTIలు, 3000 ITIలు, 500 PMKKలు, 300 JSSలు రిజిస్ట్రేషన్, పరీక్ష, పని కేంద్రాలుగా ఉన్నాయి. ప్రోగ్రామ్ పురోగతిని ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. కమిటీలో విశ్వవిద్యాలయం, స్కిల్ డెవలప్ మినిస్ట్రీ నుంచి ప్రతినిధులు ఉంటారు. మెమోరాండం పది సంవత్సరాల కాలానికి సంతకం చేస్తారు. పరస్పర ఒప్పందం ద్వారా పునరుద్ధరణకు లోబడి ఉంటుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




