IGNOU: జనవరి సెషన్‌ 2022 ప్రవేశాల గడువు పెంచిన ఇగ్నో.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Ignou Extends Registration Deadline For January Session 2022 Last Date is March 15
x

IGNOU: జనవరి సెషన్‌ 2022 ప్రవేశాల గడువు పెంచిన ఇగ్నో.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Highlights

IGNOU: జనవరి సెషన్‌ 2022 ప్రవేశాల గడువు పెంచిన ఇగ్నో.. చివరి తేదీ ఎప్పుడంటే..?

IGNOU: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ఓపెన్ అండ్ డిస్టెన్స్ మోడ్ (ODL)లో 2022 విద్యాసంవత్సరానికి (జనవరి సెషన్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీని మార్చి 15గా నిర్ణయించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఎవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ (ignouadmission.samarth.edu.in)లో ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీని పొడిగిస్తున్నట్టు ఇగ్నో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఇగ్నో జనవరి 2022 సెషన్‌కు తాజా అడ్మిషన్లు, రీ-రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మార్చి 15 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ, ప్రవేశాలు.. ఇతర ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు ఈ మెయిల్ [email protected] లేదా ఫోన్‌ 011-29572513 లేదా 29572514 నెంబర్ల ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది.

ఇంట్రెస్ట్‌ కలిగిన విద్యార్ధులు అప్లై చేసుకునే సమయంలో న్యూ రిజిస్ట్రేషన్‌ను క్రియేట్‌ చేసుకుని, అవసరమైన అన్ని వివరాలను అందించాల్సి ఉంటుంది. అలాగే ఏ కోర్సులో అడ్మిషన్‌ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీని కూడా ఎంపిక చేసుకోవాలి. చివరిగా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను సబ్‌మిట్‌ చేసేముందుగా సూచనలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాలి. కాగా ఇగ్నో వృత్తి విద్య, శిక్షణను ఉన్నత విద్యతో అనుసంధానం చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (MSDE) మంత్రిత్వ శాఖతో 2022 జనవరి 18న ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దేశ యువతకు ఉద్యోగ లేదా పని అవకాశాలను సృష్టించడం, వొకేషనల్‌ అండ్‌ టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడమే ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యం. అధికారిక సమాచారం ప్రకారం దాదాపు 32 నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్లు(NSTI), 3000 ITIలు, 500 ప్రధాన మంత్రి కౌశల్‌ కేంద్ర (PMKK), 300 JSSలు రిజిస్ట్రేషన్, పరీక్ష, పని కేంద్రాలుగా వర్సిటీతో అనుబంధం కలిగి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories