టీకా అభివృద్ధిలో భారత్‌ ముందడుగు

టీకా అభివృద్ధిలో భారత్‌ ముందడుగు
x
Highlights

క‌రోనా వైర‌స్(కోవిడ్ 19) నివార‌ణ‌కు మ‌రో ముంద‌డుగు ప‌డింది. ఈ సారి భార‌త్ ఈ ప్రాణాంత‌క‌వైర‌స్ నియంత్ర‌ణ‌కు టీకా అభివృద్థి చేయ‌నుంది.

క‌రోనా వైర‌స్(కోవిడ్ 19) నివార‌ణ‌కు మ‌రో ముంద‌డుగు ప‌డింది. ఈ సారి భార‌త్ ఈ ప్రాణాంత‌క‌వైర‌స్ నియంత్ర‌ణ‌కు టీకా అభివృద్థి చేయ‌నుంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లు స్వదేశీ టీకా అభివృద్ధి కోసం ప‌నిచేయ‌నున్నాయి. ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సేకరించిన వైరస్‌ రకాన్ని‌ ఉపయోగించుకొని పూర్తి స్వదేశీ టీకాను అభివృద్ది చేయ‌నున్నాయి. ఇందుకోసం ఈ వైరస్‌ రకాన్ని భారత్‌ బయోటెక్‌ సంస్థకు ఎన్‌ఐవీ విజయవంతంగా... బదిలీ చేసినట్లు ఐసీఎంఆర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. టీకా అభివృద్ధికి రెండు భాగస్వామ్య సంస్థలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు.

వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారత్‌ బయోటెక్‌కు ఎన్‌ఐవీ నిరంతర స‌హాకారం అందిస్తుందని స్ప‌ష్టం చేసింది. టీకాను వేగంగా అభివృద్ధి చేయడానికి, ఆ తర్వాత జంతు అధ్యయనాలు, క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించడానికి అనుమతులను సాధించేందుకు ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌లు కృషి చేస్తాయని వెల్ల‌డించింది.

ఈ ప్రాజెక్టులో ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లు(ఎన్‌ఐవీ)లతో కలిసి పనిచేయడం మాకు గర్వకారణం మ‌ని తెలిపింది. ఈ క‌రోనా మహమ్మారిపై పోరు కోసం దేశం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తాం అని పేర్కొంది. వర్ధమాన దేశాల్లో బయోసేఫ్టీ లెవెల్‌-3 స్థాయి ఉత్ప‌త్తి కేద్రం ఉన్న‌ ఏకైక సంస్థ త‌మ‌దేన‌ని భార‌త్ బ‌యోటెక్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories