ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెక్నిషియన్‌ పోస్టులు

icar iari recruitment 2021 Technician Posts in Indian Agricultural Research Institute tenth Class Eligibility
x

ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెక్నిషియన్‌ పోస్టులు.. పదో తరగతి అర్హత..(ఫైల్-ఫోటో)

Highlights

ICAR IARI Recruitment 2021: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ICAR IARI Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 641 పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- iari.res.inని సందర్శించాలి. దరఖాస్తు ప్రక్రియ 18 డిసెంబర్ 2021 నుంచి ప్రారంభమైంది.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- ICAR IARI రిక్రూట్‌మెంట్ 2021ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. చివరి తేది 10 జనవరి 2021. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను తనిఖీ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి.

ఈ తేదీలను గుర్తుంచుకోండి

  • దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: డిసెంబర్ 18, 2021
  • దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 10, 2022
  • ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష తేదీ: జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5, 2022

ఖాళీ వివరాలు

నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 641 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 286 సీట్లు కేటాయించారు. ఇది కాకుండా ఓబీసీ కేటగిరీలో 133 సీట్లు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 61 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 93 సీట్లు, ఎస్టీ కేటగిరీలో 68 సీట్లు కేటాయించారు.

అర్హత & వయో పరిమితి

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ప్రత్యేకంగా దరఖాస్తు ఫారమ్‌లోని సంబంధిత కాలమ్‌లో మార్కుల శాతాన్ని నింపాలి. అదే సమయంలో దరఖాస్తుదారు వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము

ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి జనరల్, ఆర్థికంగా బలహీనులు అంటే EWS, OBC అభ్యర్థులు రూ. 1000 డిపాజిట్ చేయాలి. SC, ST అభ్యర్థులు 300 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దీన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories