IBPS Recruitment 2022: నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. ఐబీపీఎస్ నుంచి 8000 ఉద్యోగాలు..!

IBPS RRB Recruitment 2022 8000 Officers and Office Assistants
x

IBPS Recruitment 2022: నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. ఐబీపీఎస్ నుంచి 8000 ఉద్యోగాలు..!

Highlights

IBPS Recruitment 2022: నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. ఐబీపీఎస్ నుంచి 8000 ఉద్యోగాలు..!

IBPS Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) బ్యాంకింగ్‌లో కెరీర్ చేయాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఐబీపీఎస్ రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో బంపర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 8000 పైగా ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టుల కోసం నిర్వహిస్తున్నారు. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 07 జూన్ 2022

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 27 జూన్ 2022

దరఖాస్తు రుసుము సమర్పించడానికి చివరి తేదీ - 27 జూన్ 2022

ప్రీ-ఎగ్జామ్ తేదీ - ఆగస్టు 2022

ప్రధాన పరీక్ష తేదీ - సెప్టెంబర్/అక్టోబర్ 2022

IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ – 4483 పోస్టులు

IBPS RRB ఆఫీసర్ స్కేల్ I – 2676 పోస్టులు

IBPS RRB ఆఫీసర్ స్కేల్ II – 842 పోస్ట్‌లు

IBPS RRB ఆఫీసర్ స్కేల్ III – 80 పోస్టులు

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి గురించి చెప్పాలంటే కొన్ని పోస్టులలో వయస్సు 21 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి. కొన్ని పోస్టులకు వయోపరిమితి 21 నుంచి 32 ఏళ్లు ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ వయస్సు పరిమితి 18-28 సంవత్సరాలు. దీని గురించి మరింత సమాచారం కోసం మీరు నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories