ఆస్తి కోసం కన్న తల్లిని చితకబాది నరకం చూపిస్తోన్న బిడ్డ... వీడియో వైరల్

ఆస్తి కోసం కన్న తల్లిని చితకబాది నరకం చూపిస్తోన్న బిడ్డ... వీడియో వైరల్
x
Highlights

Mother harassed by daughter for property: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ తన కన్న తల్లిని అతి దారుణంగా హింసించడం...

Mother harassed by daughter for property: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ తన కన్న తల్లిని అతి దారుణంగా హింసించడం కనిపిస్తోంది. నీ రక్తం తాగుతానంటూ తల్లి తొడపై కొరకడం, జుట్టు పట్టీ లాగడం, చెంపలపై కొట్టడం, కాలుతో తన్నడం... ఇలా రకరకాలుగా ఆ తల్లికి నరకం చూపిస్తోంది ఆ మహిళ. ఈ వీడియోలో కనిపిస్తోన్న బాధితురాలి పేరు నిర్మలా దేవి. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేస్తోన్న మహిళ పేరు రీటా.

ఆ దెబ్బలు తాళలేక తనను విడిచిపెట్టమని ఆ కన్న తల్లి ఏడుచుకుంటూ ఎంత ప్రాధేయపడుతున్నా ఆ బిడ్డ మనసు కరగడం లేదు. బిడ్డ కొట్టే దెబ్బల బాధ భరించలేక ఆ తల్లి గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నారు. అయినప్పటికీ ఆ మహిళ కన్న తల్లిని వేధించడం ఆపలేదు. పైగా ఇదంతా సరదానే అని అంటూనే ఆ తల్లిని హింసించిన తీరు చూసి వీక్షకులు మండిపడుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ వృద్ధురాలి కొడుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన సోదరి రీటాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హర్యానాలోని హిసార్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తిని ఆమె పేర రాయించుకోవడం కోసం తన సోదరి కన్నతల్లిని బంధించి చిత్రహింసలు పెడుతోందని అమర్‌దీప్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు.

అమర్‌దీప్ ఇచ్చిన ఫిర్యాదుతో హిసార్‌లోని ఆజాద్ నగర్ పోలీసులు రీటాపై కేసు నమోదు చేశారు. తల్లిని హింసించి వేధింపులకు గురిచేస్తున్నందుకు భారత న్యాయ సంహితలోని మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ 2007 (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) కింద కేసు నమోదు చేసి రీటాను అరెస్ట్ చేశారు. ఆజాద్ నగర్ ఇన్‌స్పెక్టర్ సాధురాం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

కన్న తల్లిని మంచంపై నుండి కిందకు తన్నడం, కొట్టడం అలాగే కొనసాగించింది. నీ వల్లే నేనిలా చేయాల్సి వస్తోంది... ఎల్లకాలం బతకడానికి వచ్చావా అంటూ తల్లిపైనే గట్టిగట్టిగా కేకలు వేసింది. ఈ దృశ్యాలన్నీ చూసిన నెటిజెన్స్ రీటా తీరుపై కామెంట్స్ రూపంలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.

రీటా తమకు కురుక్షేత్రలో ఉన్న మరో ఇంటిని కూడా రూ. 65 లక్షలకు అమ్మేసి డబ్బులు తీసుకుందని అమర్ తెలిపారు. ఇప్పుడు తమ తల్లి ఉంటున్న ఇంట్లోకే వచ్చి ఆమెను బంధించి హింసిస్తోందన్నారు. తను అటువైపు వెళ్తే వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తోందని అమర్ పోలీసుల ఎదుట వాపోయారు.

హింసాత్మకంగా ఉన్న ఆ దృశ్యాన్ని ఇక్కడ షేర్ చేయడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories