Meghalaya honeymoon murder: హనీమూన్ హత్య కేసు.. భర్త రాజా రఘువంశీని చంపినట్లు ఒప్పుకున్న‌ సోనమ్..!

Meghalaya honeymoon murder
x

Meghalaya honeymoon murder: హనీమూన్ హత్య కేసు.. భర్త రాజా రఘువంశీని చంపినట్లు ఒప్పుకున్న‌ సోనమ్..!

Highlights

Meghalaya honeymoon murder: దేశాన్ని కుదిపేసిన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన రాజాను తానే హత్య చేయించానని అతని భార్య సోనమ్ అంగీకరించింది.

Meghalaya honeymoon murder: దేశాన్ని కుదిపేసిన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన రాజాను తానే హత్య చేయించానని అతని భార్య సోనమ్ అంగీకరించింది. ఈ షాకింగ్ విషయాన్ని మేఘాలయ పోలీసులు స్వయంగా వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 11న రాజా, సోనమ్ వివాహం జరిగింది. ఆ తర్వాత హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే, మే 23న రాజా దారుణ హత్యకు గురయ్యాడు. జూన్ 2న రాజా మృతదేహాన్ని పోలీసులు ఓ లోయలో గుర్తించారు.

విచారణలో సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు వ్యక్తులు ఆకాశ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మిలతో కలిసి ఈ హత్యకు పథకం వేసినట్లు అంగీకరించింది. రాజ్ కుష్వాహా ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు.

సోనమ్‌కు రాజాను పెళ్లి చేసుకోవడానికి ముందే రాజ్ కుష్వాహాతో సంబంధం ఉందని, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే ఆమె రాజాను పెళ్లి చేసుకుందని విచారణలో తేలింది. మే 23న దంపతులిద్దరూ నాంగ్రియాట్‌లోని హోటల్ నుంచి ఉదయాన్నే చెక్-అవుట్ చేసి చిరపుంజిలో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అయితే, సోనమ్ తన ప్రియుడితో కలిసి రాజాను హత్య చేయించింది. ఆ తర్వాత మృతదేహాన్ని లోయలో పడేసింది.

ఈ కేసును ఛేదించడానికి పోలీసులు డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలను సేకరించారు. నిందితులందరూ సోనమ్ ఈ నేరానికి సూత్రధారి అని అంగీకరించారని రాజా సోదరుడు, కుటుంబ సభ్యులు తెలిపారు.

హనీమూన్ హత్య కేసులో భార్య చేసిన మోసం, కుట్ర బయటపడటంతో దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి నెలకొంది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories