లక్షద్వీప్‌ తీరంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత.. సుమారు రూ.1,526 కోట్లు...

Huge Drugs Racket Found in Lakshadweep worth of 1526 Crores | Live News Today
x

లక్షద్వీప్‌ తీరంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత.. సుమారు రూ.1,526 కోట్లు...

Highlights

Lakshadweep: 218 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్న డీఆర్‌ఐ, ఐసీజీ...

Lakshadweep: లక్షద్వీప్‌ తీరంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. లక్షద్వీప్‌ తీరంలో పడవల్లో తరలిస్తున్న 218 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఆపరేషన్‌ ఖొజ్బీన్‌ పేరుతో అగట్టి తీరంలో డీఆర్‌ఐ, ఐసీజీ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు చేశారు. కిలో ప్యాకెట్ల చొప్పున రెండు బోట్లలో రవాణా చేస్తున్న 218 పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ విలువ మార్కెట్‌లో సుమారు రూ.1,526 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

పలువురిని అరెస్టు చేసి, పడవలను కొచ్చికి తరలించారు. గత రెండు నెలల వ్యవధిలో దేశంలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడటం ఇది నాలుగోసారి. ఏప్రిల్‌ నుంచి 3800 కిలోలకు పైగా హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ మొత్తంగా దాదాపు 26వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories