Tamil Nadu: తంజావూర్లో పరువు హత్య.. కన్నకూతురినే చంపిన తల్లిదండ్రులు

Honor Killing In Thanjavur District of Tamil Nadu
x

Tamil Nadu: తంజావూర్లో పరువు హత్య.. కన్నకూతురినే చంపిన తల్లిదండ్రులు

Highlights

Tamil Nadu: పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియుడు నవీన్

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా పట్టుకోట్టై గ్రామంలో దారుణం జరిగింది. వేరే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందనే కోపంతో.. కన్న కూతురిని పెట్రోల్ పోసి తగులబెట్టి మరీ హత్య చేశారు తల్లిదండ్రులు. స్కూల్‌ డేస్‌ నుంచే పరిచయమున్న ఐశ్వర్య, నవీన్‌ అనే ప్రేమికులు.. తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే యువకుడి ఇంట్లో ఉంటున్న వారి కూతురిని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వెళ్లారు.

రెండ్రోజుల తర్వాత మళ్లీ దిగబెడతామంటూ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లారు. వేరే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని తమను అవమానించి.. పరువు తీసిందని.. పెట్రోల్ పోసి నిప్పటించి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. తన భార్యను తిరిగి ఇంటికి పంపించకపోవడంతో నవీన్ పోలీసులను ఆశ్రయిండంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో.. అసలు విషయం బయటపడింది. హత్య కేసులో తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories