
Holi 2026 Bank Holidays: హోలీ 2026 బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఇదే..!
మార్చి నెలలో హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసివేయబడతాయో తెలుసుకోండి..!
Holi 2026 : వసంత కాలం వచ్చేసింది.. రంగుల కేళి హోలీ పండుగ ముంగిట నిలిచింది! అయితే, ఈ ఏడాది హోలీ కేవలం రంగులనే కాదు, బ్యాంక్ కస్టమర్లకు కొంత 'కన్ఫ్యూజన్' కూడా తీసుకువస్తోంది. మీరు మార్చి మొదటి వారంలో బ్యాంకు పనులను ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. 2026 మార్చి 3 మరియు 4 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఏయే రాష్ట్రాల్లో మూతపడనున్నాయో తెలుసుకుంటే, చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు.
భారతదేశంలో బ్యాంక్ సెలవులు రాష్ట్రాల సంస్కృతి, ఆచారాలను బట్టి మారుతుంటాయి. ఈ ఏడాది హోలీ పండుగను కొన్ని రాష్ట్రాలు మార్చి 3న, మరికొన్ని మార్చి 4న జరుపుకుంటున్నాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం సెలవుల జాబితా ఇలా ఉంది.హోలికా దహన్, డోల్ జాత్రా, అట్టుకల్ పొంగలా వంటి వేడుకల కారణంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ వంటి 14 రాష్ట్రాల్లో మార్చి 3న బ్యాంకులు పనిచేయవు.
రంగవాలి హోలీ సంబరాలు మిన్నంటే తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో మార్చి 4న బ్యాంకులు మూసి ఉంటాయి.ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి కాబట్టి, అక్కడ వరుసగా రెండు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.
కేవలం హోలీ మాత్రమే కాదు, మార్చి 2026లో బ్యాంక్ సెలవుల జాబితా చాంతాడంత ఉంది.ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మార్చి చివరలో బ్యాంకులు మూతపడతాయి.రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుల పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.
ఇవే కాకుండా గుఢీ పడ్వా, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి వంటి పండుగలు కూడా ఈ నెలలోనే ఉన్నాయి.బ్యాంకుకు వెళ్లాల్సిన అత్యవసర పనులు ఉంటే మార్చి 2లోపే పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ బ్యాంకులు మూసి ఉన్నా.. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ మరియు ATM సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. నగదు బదిలీ కోసం UPI సేవలను వాడుకోవచ్చు. పండుగ పూట డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే, ముందుగానే మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను సరిచూసుకోండి. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకుని మీ ప్రయాణాలు, లావాదేవీలను ప్లాన్ చేసుకోండి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




