
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలంలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలంలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై పెద్ద ఎత్తున నిరసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందస్తుప్రణాళికతో దాడి చేసినట్లు తెలుస్తోంది. రాత్రి షిఫ్టులో ఉండాల్సిన గార్డులు కూడా రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని పలువురు విద్యార్ధులు అంటున్నారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలుపైకూడా దాడి జరిగిందని ఓ విద్యార్థి వెల్లడించారు. బాబర్ కీ ఔలాద్ అంటూ ఓ అంథ విద్యార్థిని సైతం చితబాదారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పదించలేదని, ఘటన స్థలానికి ఎవరు రాలేదని వాపోయారు.
మరోవైపు ఈ దాడికి తామే కారణం హిందూ రక్షాదళ్ సంచలన ప్రకటన చేసింది. హిందూ రక్షాదళ్ అధ్యక్షుడు భూపేంద్ర తోమర్ అలియాన్ పింకీ చౌధ సోషల్‌మీడియాలో ఓ విడుదల ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో భూపేంద్ర తోమర్ అలియాన్ పింకీ చౌధ జేఎన్‌యూ కమ్యూనిస్టులకు హబ్‌గా మారిందిని, వారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భవిష‌్యత్తులో మరే యూనివర్సిటీలో ఇలాంటివి సహించబోమని, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసిన ఇలాంటి ఘటనలో రిపీట్ అవుతాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మరోవైపు దాడి చేసింది తమ కార్యకర్తలే అని పింకీ చౌధరీ ఓ మీడియాతో చెప్పారని వార్తు వస్తున్నాయి. భూపేంద్ర తోమర్ అలియాన్ పింకీ చౌధ ప్రకటనపై పోలీస్ వర్గాలు దృష్టి సారించాయి. భూపేంద్ర తోమర్ అలియాన్ పింకీ చౌధ ప్రకటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించాయి. వీడియో పుటేజ్‌లు, ఎక్కడ నుంచి మాట్లాడారనేది పరిశీలిస్తున్నారు.
ఈ దాడుల్లో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఇనుప రాడ్లతో దాడిలో గాయపడిన వారి విద్యార్థులలో వామపక్ష, ముస్లిం విద్యార్థులవే అవడం గమనార్హం . దుండగులు ఒక్కసారిగా క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ఫ్రొఫిసర్లపై విరుచుకుపడ్డారు. కొందరు లెక్చరర్లు సహా విద్యార్థులతో సమావేశం జరుగుతుండగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు లెక్చరర్లకు కూడా గాయాలయ్యాయి. ఏబీవీపీ నేతలే దాడులకు పాల్పడినట్లు జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. కొందరు బయటి వ్యక్తులతో కలిసి దాడులకు తెగబడ్డారని చెబుతున్నారు. వర్సిటీలోని సబర్మతితో పాటు పలు వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడులు చేశారని ఆరోపించారు. ఈ ఘటనను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. తక్షణమే వర్సిటీ శాంతియుత వాతావరణం తెచ్చేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆయన ఆదేశించారు. దాడుల్లో ప్రొఫెసర్లు, విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన చెందారు. విద్యార్థుల గొంతునొక్కే చర్యలుగా ఆయన అభివర్ణించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




