ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్న ప్రముఖ రచయిత గీతాంజలి...

Hindi Novelist Geetanjali Shree Won International Booker Prize 2022 for Tomb of Sand | Live News
x

ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్న ప్రముఖ రచయిత గీతాంజలి...

Highlights

International Booker Prize 2022: సాహిత్యంలో అత్యుత్తమ నవలను ఎంపిక చేసి ప్రైజ్ ప్రకటించిన నిర్వాహకులు...

International Booker Prize 2022: ప్రముఖ హిందీ నవలా రచయిత గీతాంజలి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ ను గెలుచుకొని చరిత్ర సృష్టించారు. సాహిత్యంలో అత్యుత్తమ నవలను ఎంపిక చేసి ఈ ప్రైజ్ ఏటా ప్రకటిస్తుంటారు. టూంబ్ ఆఫ్ శాండ్ పేరుతో గీతాంజలి రచించిన నవలను ఈ ఏడాదికిగాను బుకర్ ప్రైజ్ వరించింది. భారతీయ భాషల్లో బుకర్ ప్రైజ్ అవార్డు గెలుచుకున్న మొదటి పుస్తకంగా ఇది రికార్డు నమోదు చేసింది.

ఈ హిందీ నవలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేసిన అమెరికా ట్రాన్స్ లేటర్ డైసీ రాక్ వెల్ తో సంయుక్తంగా బుకర్ ప్రైజ్ ను గీతాంజలి గెల్చుకున్నారు. టూంబ్ ఆఫ్ శాండ్ పుస్తకాన్ని బలమైన వాదాన్ని విన్పించే ఎదురులేని నవలగా అవార్డు నిర్ణేతలు అభివర్ణించారు. అవార్డుతో పాటు 50వేల పౌండ్లను విజేతలకు అందజేస్తారు. యూపీలో జన్మించి ఢిల్లీలో పెరిగిన గీతాంజలి..ఇప్పటివరకు 3 నవలలు, పలు కథలను రాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories