కేరళ 'బడ్జెట్ 2020-21' లోని ముఖ్యంశాలు..

కేరళ బడ్జెట్ 2020-21 లోని ముఖ్యంశాలు..
x
Highlights

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ 2020-21 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి టిఎం థామస్ ఐజాక్ శుక్రవారం సమర్పించారు.

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ 2020-21 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి టిఎం థామస్ ఐజాక్ శుక్రవారం సమర్పించారు. శుక్రవారం కేరళ అసెంబ్లీలో మంత్రి బడ్జెట్ ప్రదర్శనలోని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.

ధర రూ. 2 లక్షలు పైన ఉన్న కొత్త ద్విచక్ర వాహనాలు రూ. 15 లక్షలకు పైన ఉన్న కార్లపై 2% పన్ను పెంపును బడ్జెట్ ప్రతిపాదించింది.

♦ జీఎస్టీ సేకరణను మెరుగుపరచడానికి 12-పాయింట్ల ప్యాకేజీ.

♦ భూమి ధర 10% పెంపు, పెద్ద ప్రాజెక్టుల సమీపంలో ఉన్న భూమికి అదనంగా 30% వరకు పెంపు.

♦ స్థానిక సంస్థల వ్యయం12,724 కోట్లుగా ఉంది.

♦ పేదల గృహనిర్మాణం లైఫ్ మిషన్ కోసం 2,000 కోట్లు.

♦ నీటి సరఫరా ప్రాజెక్టులకు 4,384 కేటాయింపు.

♦ సంక్షేమ పెన్షన్లుకు అదనంగా రూ.100 పెంపు.

♦ గ్రామీణ రహదారుల నిర్మాణం మరియు అభివృద్ధి కోసం 1,000 కోట్లు కేటాయించారు.

♦ తీరప్రాంత అభివృద్ధి ప్యాకేజీకి రూ.1,000 కోట్లు.

♦ 2020- 21లో ఇళ్లకు 2.5 లక్షల నీటి కనెక్షన్లు అలాగే కొత్తగా1,00,000 ఇళ్ళ నిర్మాణం.

♦ 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి.

♦ ప్రవాస మలయాళుల సంక్షేమం కోసం 900 కోట్లు కేటాయించారు.

♦ వరి రైతులకు రాయల్టీ కోసం 40 కోట్ల రూపాయలు.

♦ కేరళలో ఐటి వర్క్‌ఫోర్స్ లక్ష నుంచి 1,85,000 కు పెరుగుదల.

♦ స్టార్టప్‌ల కోసం ప్యాకేజీ : ప్రోటోటైప్‌ల అభివృద్ధికి 1 కోట్ల వరకు సహాయం, స్టాంప్ డ్యూటీ హేతుబద్ధీకరణ.

♦ నవంబర్ 2020 నుండి ఫిలమెంట్ బల్బులు, సిఎఫ్ఎల్ అమ్మకాలపై నిషేధం.

♦ బేకల్ నుండి కోవళం వరకు 585 కిలోమీటర్ల పశ్చిమ తీర కాలువ 2020 లో ప్రారంభమవుతుంది.

♦ కొచ్చిలో 6,000 కోట్ల నిర్మాణ పనులకు శ్రీకారం.

♦ ఇంటిగ్రేటెడ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టును అమలు చేయడానికి కొచ్చి మెట్రో.

♦ పర్యాటక రంగాన్ని పెంచడానికి, బోట్ లీగ్‌కు 20 కోట్ల వ్యయం. 2020 లో ముజిరిస్ హెరిటేజ్ ప్రాజెక్ట్, ఫేస్‌లిఫ్ట్ స్వీకరించడానికి అలప్పుజలోని 12 మ్యూజియంలు, స్పైస్ రూట్ , మలబార్ టూరిజం లకు ప్రోత్సాహకాలు.

♦అవయవ మార్పిడి కోసం క్యాన్సర్ నిరోధక మందులు మరియు ఓషధాల ఉత్పత్తిని పెంచడానికి కేరళ రాష్ట్ర మందులు ఓషధాల వినియోగం కోసం ఆంకాలజీ పార్కు ఏర్పాటు.

♦ క్లీన్ కేరళ ప్రాజెక్టు కింద 25 వేల చెరువులు, సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు.

♦ హార్టికల్చర్ ప్రమోషన్ కోసం రెయిన్ షెల్టర్స్ ఏర్పాటు.. ఇందుకోసం కోటి పండ్ల మొక్కలు నాటాలి, కూరగాయల మరియు పండ్ల పంపిణీ కోసం ఉబెర్-రకం అగ్రిగేటర్ సేవ.

♦ కుడుంబశ్రీ మిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన 1,000 హోటళ్ళలో ఒక్కో ప్లేట్‌కు రూ. 25 చొప్పున భోజనం.

♦ కుడుంబశ్రీ మిషన్ కోసం 600 కోట్ల రూపాయలు కేటాయింపు.

♦ 2,000 కోట్లు వయనాడ్ ప్యాకేజీ / వెదురు మరియు కార్బన్ సీక్వెస్ట్రేషన్ కోసం చెట్ల పెంపకం.

♦ 2,400 కోట్లు కుట్టనాడ్ ప్యాకేజీ కోసం కేటాయింపు.

♦ ఉన్నత విద్యా రంగంలో 1,000 కొత్త ఉపాధ్యాయ పోస్టుల నియామకం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories