Uttarakhand: ఉత్తరకాశీలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం

Helicopter crashes in Uttarkashi six passengers killed
x

Uttarakhand: ఉత్తరకాశీలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం

Highlights

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం 9 గంటలకు గంగానై సమీపంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు...

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం 9 గంటలకు గంగానై సమీపంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ హెలికాప్టర్ ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినదని, గంగోత్రి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలీకాప్టర్ లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఐదుగురు మరణించగా..ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories