Heavy Snowfall: గంగోత్రి ఆలయంపై మంచు దుప్పటి

Heavy Snowfall in Uttarakhand  And Jammu and Kashmir
x

Heavy Snowfall: గంగోత్రి ఆలయంపై మంచు దుప్పటి

Highlights

Heavy Snowfall: కశ్మీర్‌లోనూ భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Heavy Snowfall: ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం గంగోత్రి ఆలయాన్ని మంచుదుప్పటి కప్పేసింది. ఆలయ పరిసరాల్లో కనుచూపుమేర హిమపాతం పరుచుకుంది. అటు కశ్మీర్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. ఇళ్లను, రోడ్లను పూర్తిగా మంచు కప్పేసింది.

రహదారులపై ఎక్కడ చూసినా హిమపాతం పేరుకుపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పర్యాటకులు, స్థానికులు మంచు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ శీతాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. హిమాలయాలకు ఆనుకుని ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా మంచు కురుస్తుంది. దాంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఎక్కడపడితే అక్కడ మంచు మేటలు వేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories