Election 2024: ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో భారీ బందోబస్తు

Heavy Security Has Been Arranged In The Maoist-Affected Districts In The Wake Of The Elections
x

Election 2024: ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో భారీ బందోబస్తు

Highlights

Election 2024: రంగంలోకి సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్

Election 2024: మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు సైతం రంగంలోకి దిగాయి. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన బీజాపూర్, సుకుమా, దంతెవాడ, నారాయణఖేడ్, కాంకేర్ జిల్లాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పపటోలా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిన 48 గంటల తర్వాత మావోయిస్టులు స్పందించారు. చోటెబెధియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన తమ సహచరుల విషయంలో పోలీసులు గందరగోళం సృష్టిస్తున్నారని, దీంతో మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. మృతుల వివరాలను విప్లవ గిరిజన మహిళా సంస్థ దండకారణ్య ప్రతినిధి పేరిట పత్రికలకు లేఖ విడుదల చేశారు.

అంతేకాకుండా వీరమరణం పొందిన తమ సహచరుల ఇద్దరి వివరాలు లేవని లేఖలో పేర్కొని సంచలనం సృష్టించారు. దీంతో జరిగిన ఘటనకు ప్రతి చర్యగా మావోయిస్టు పెద్ద ఎత్తున ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసేందుకు వ్యూహరచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని సరిహద్దు రహదారులపై చెట్లను నరికి రోడ్లను దిగ్బంధం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికలను బహిష్కరించాలని, బూటకపు ఎన్‌కౌంటర్లను అరికట్టాలని కోరుతూ బ్యానర్లు, కరపత్రాలు వదిలి వెళ్తుండటంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అలర్ట్ అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories