Heavy rains in Maharashtra: ఆ రాష్ట్రంలో కరోనాతో పాటు కుమ్మేస్తున్న వర్షాలతో ప్రజలు బేజారు!

Heavy rains in Maharashtra: ఆ రాష్ట్రంలో కరోనాతో పాటు కుమ్మేస్తున్న వర్షాలతో ప్రజలు బేజారు!
x
Heavy rains in Maharashtra (File Photo)
Highlights

Heavy rains in Maharashtra: బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావం కొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది.

Heavy rains in Maharashtra: బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావం కొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. ఒక పక్క కరోనాతో బాధపడుతుంటే మరో పక్క వర్షాలు కురుస్తుండటం వల్ల ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. వీటి వల్ల జన జీవనం స్థంబించడమే కాకుండా ఈ వాతావరణం కరోనా వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉండటంతో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక మహారాష్ట్ర విషయానికొస్తే దేశంలోని ఎక్కువ కేసులు నమోదువుతండగా, వీటికి తోడు భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మహారాష్ట్రలో ఓ వైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ముంబై, థానే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరుగుతున్నాయి. అంతేకాదు.. వృక్షాలు విరిగిపడి.. అనేక వాహనాలు ధ్వంసమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ

జలమయమవుతున్నాయి. తాజాగా మంగళవారం కురిసిన భారీ వర్షానికి థానే ప్రాంతంలోని మహాత్మాపూలే నగర్‌ శ్రీ అయ్యప్ప టెంపుల్ సమీపంలో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. దీంతో అక్కడే ఉన్న పలు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చెట్లు విరిగిపడిపోవడంతో.. అక్కడ స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మంగళవారం నాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories