మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు.. గ్రామాల్లో రోడ్లులేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Heavy Rains In Madhya Pradesh
x

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు.. గ్రామాల్లో రోడ్లులేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Highlights

Rains: గ్రామీణ ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న వాగులు

Rains: మధ్యప్రదేశ్‌లో వాన కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఏకమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనం కష్టంగా మారింది. ఎమర్జెన్సీ సమయంలో అయితే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బర్వానీ పన్సెమల్‌లో ఓ గర్భిణీ ఆస్పత్రికి వెళ్లేందుకు నరక యాతన అనుభవించింది. గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్ళాలంటే వాగు దాటాల్సిందే.. వాగు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో గ్రామంలోకి అంబులెన్స్‌ రావడం కష్టంగా మారింది. దీంతో గ్రామస్తులు ఓ దుప్పటిలో గర్భిణీని పడుకోబెట్టి.. ఓ కర్రకు దుప్పటి కట్టి నలుగురు వ్యక్తులు మోస్తూ వాగు దాటించారు. వర్షాకాలం వస్తే మాకు ఈ తిప్పలు తప్పంటున్నారు గ్రామస్తులు.

Show Full Article
Print Article
Next Story
More Stories