Heavy Rains: హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rains in Himachal Pradesh
x

Heavy Rains: హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి.. లోతట్టు ప్రాంతాలు జలమయం 

Highlights

Heavy Rains: పలు ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండ చరియలు.. రాకపోకలకు అంతరాయం

Heavy Rains: హిమాచల్‌ప్రదేశ్‌లో బారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బియాస్‌ నది ఉగ్రరూపం దాల్చింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల ఇండ్లు నీట మునిగాయి. కులూ, మండి ప్రాంతాల్లో 3వ నంబర్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

పండోహ్‌ ఏరియాలో ఇండ్లు నీట మునగడంతో ఆ నివాసాల్లో చిక్కుకున్న వారిని SDRF బలగాలు రక్షించాయి. పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్స్‌ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో కల్కా-షిమ్లా రైల్వే మార్గంలోని కోటి, సన్వారా రైల్వేస్టేషన్‌ల మధ్య రైల్వే ట్రాక్‌ను తాత్కాలికంగా మూసివేశారు. వర్షాలు, వరదలవల్ల రూ.362 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories